టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత

టిక్‌టాక్‌పై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విధించిన నిషేధం ఎత్తేసింది. యువత, చిన్నారుల్లో ఎంతో ఆదరణ పొందిన ఈ యాప్ వల్ల అశ్లీల కంటెంట్‌తో పాటు చిన్నారుల్లో ఉద్రేకాన్ని పెంచుతుందని చెబుతూ ఒక లాయర్ హైకోర్టులో కేసు వేశారు. దీంతో ఈ యాప్‌ను తాత్కాలికంగా నిషేధిస్తూ మధురై బెంచ్ ఈ నెల 3న ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఈ యాప్ మాతృసంస్థ అయిన చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ సుప్రీంకోర్టులో ఈ ఆదేశాలను సవాల్ చేసింది. అభిషేక్ మను సింగ్వి ఈ సంస్థ తరపున వాదిస్తూ.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల వల్ల ఆ సంస్థలకు రోజుకు 4.5 కోట్ల నష్టం వాటిల్లుతోందని అన్నారు. దాదాపు 250 మంది ఉద్యోగుల భవిత్యం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పారు. ఇప్పటికే ఈ యాప్‌ని 13 ఏండ్ల కంటే తక్కువ వయస్సున్న వాళ్లు ఉపయోగించకుండా చర్యలు తీసుకున్నామని.. అసభ్యకరమైన, అభ్యంతరకరమైన వీడియోలు పోస్ట్ చేయకుండా నిరోధిస్తున్నామని ఆయన వాదించారు.

మరో వైపు టిక్ టాక్ యాప్‌పై విధించిన నిషేధంపై వెంటనే స్పందించాలని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించినా సంబంధిత శాఖ ఎలాంటి జవాబు ఇవ్వలేదు. దీంతో మద్రాస్ హైకోర్టు విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా ఉపసంహరించారు.

ఇక టిక్ టాక్ వల్ల ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్‌గా తిరువూరుకు చెందిన ఒక యువకుడు అసభ్యంగా వీడియో పెట్టాడు. అంతకు మునుపు తమిళనాడుకు చెందిన కలెక్టర్ రోహిహి ఫొటొలను అసభ్యంగా చిత్రీకరిస్తూ టిక్‌టాక్‌లో వీడియో పెట్టారు.