Telugu Global
Cinema & Entertainment

అన్నీ చిన్న సినిమాలే.... ఆ ఒక్కటే అడ్డంకి

మూడు వారాలైనా మజిలీ సినిమా ఇంకా థియేటర్లలో కొనసాగుతోంది. కొద్దో గొప్పో వసూళ్లు ఆ సినిమాకు వస్తూనే ఉన్నాయి. అవన్నీ లాభాలే. ఇక జెర్సీ సినిమా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన కాంచన-3 సినిమా కూడా క్లిక్ అయింది. ఇప్పుడీ 3 సినిమాలు మరో వారం పాటు సేఫ్ గా నడవాలంటే, ఈ వారాంతం వచ్చే సినిమాల ఫలితాలపై అది ఆధారపడి ఉంది. ఈ వారాంతం ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. […]

అన్నీ చిన్న సినిమాలే.... ఆ ఒక్కటే అడ్డంకి
X

మూడు వారాలైనా మజిలీ సినిమా ఇంకా థియేటర్లలో కొనసాగుతోంది. కొద్దో గొప్పో వసూళ్లు ఆ సినిమాకు వస్తూనే ఉన్నాయి. అవన్నీ లాభాలే. ఇక జెర్సీ సినిమా ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఈ రెండు సినిమాలతో పాటు వచ్చిన కాంచన-3 సినిమా కూడా క్లిక్ అయింది. ఇప్పుడీ 3 సినిమాలు మరో వారం పాటు సేఫ్ గా నడవాలంటే, ఈ వారాంతం వచ్చే సినిమాల ఫలితాలపై అది ఆధారపడి ఉంది.

ఈ వారాంతం ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిలో 4 స్ట్రయిట్ సినిమాలు కాగా, 3 డబ్బింగ్ సినిమాలు. 4 స్ట్రయిట్ సినిమాలతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అవి చిన్న సినిమాలే. ఇక 3 డబ్బింగ్ సినిమాల్లో రెండింటితో ఎలాంటి సమస్య లేదు. ఎటొచ్చి ఒక్క డబ్బింగ్ మూవీ మాత్రం కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోంది. అదే ఎవెంజర్స్ ఎండ్ గేమ్.

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన ఎవెంజర్స్ సిరీస్ లో ఆఖరి భాగం ఇది. అందుకే దీనికి అంత క్రేజ్. ఇక ఇండియాలో ఈ సినిమా క్రేజ్ ఎంతలా ఉందంటే.. దేశంలోని అన్ని మల్టీప్లెక్సుల్లో 3 రోజులకు సరిపడా టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయానికొద్దాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.

హైదరాబాద్ లో శుక్ర, శని, ఆదివారాలకు సంబంధించి ఎవెంజర్స్ టిక్కెట్లు అయిపోయాయి. ఎంతలా ఫుల్ అయిపోయాయంటే, మారుమూల థియేటర్లలో కూడా టిక్కెట్లు లేవు. అటు ఏపీలోని ముఖ్య పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ సినిమా ఏమాత్రం క్లిక్ అయినా జెర్సీ, కాంచన-3కి దెబ్బ. పైగా తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులన్నీ ఆక్రమించేసింది ఈ మూవీ. ఈ విషయంలో కాంచన-3 కాస్త సేఫ్. జెర్సీకి మాత్రం ఎవెంజర్స్ సెగ గట్టిగానే తగలబోతోంది.

First Published:  24 April 2019 10:59 PM GMT
Next Story