Telugu Global
Cinema & Entertainment

F2 హీరోలు.... ఇప్పుడు ఇలా కలిశారు...

చిన్నప్పుడు మనం అందరం అల్లావుద్దీన్ అద్భుతదీపం కథల ని విన్నాము, చదివాము. ఇదే కథ ని ఇప్పుడు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి చెప్తే ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మొదట్లో నే తెలుగు సినిమా పరిశ్రమ లో f2 పేరున మొదటి విజయం సాధించారు ఈ హీరోలు. సినిమా విజయం తర్వాత ఇరువురు కలిసి ఇప్పుడు అల్లావుద్దీన్ సినిమా కోసం గాత్రాన్ని అరువు ఇవ్వడం జరుగుతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ […]

F2 హీరోలు.... ఇప్పుడు ఇలా కలిశారు...
X

చిన్నప్పుడు మనం అందరం అల్లావుద్దీన్ అద్భుతదీపం కథల ని విన్నాము, చదివాము. ఇదే కథ ని ఇప్పుడు విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి చెప్తే ఎలా ఉంటుంది? ఈ సంవత్సరం మొదట్లో నే తెలుగు సినిమా పరిశ్రమ లో f2 పేరున మొదటి విజయం సాధించారు ఈ హీరోలు.

సినిమా విజయం తర్వాత ఇరువురు కలిసి ఇప్పుడు అల్లావుద్దీన్ సినిమా కోసం గాత్రాన్ని అరువు ఇవ్వడం జరుగుతుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల అవుతుండగా అల్లావుద్దీన్ పాత్ర కి వరుణ్ తేజ్, జీనీ పాత్ర కి వెంకటేష్ గొంతు ని ఇచ్చారు.

వారి గాత్రం తో ఉన్న ట్రైలర్ ని విడుదల చేసిన నిర్మాతలు, ట్రైలర్ లింక్ తో పాటు, “అబ్బాయి అమ్మాయిని కలిశాడు. ఒక నిమిషం. అబ్బాయి జీనీని కలిశాడు. జీనీ తన మూడు కోరికలు తీర్చాడు. మిగితావన్ని చరిత్రే. తరువాత జరిగేదేంటో మే 24th తెలుసుకోండి” అని పోస్ట్ చేశారు.

చూడబోతుంటే ఇది పిల్లలను విశేషంగా ఆకర్షిస్తుంది అనడం లో ఏం సందేహం లేదు. అలాగే వరుణ్, వెంకీ ల గాత్రం కూడా ఈ సినిమా కి బాగానే పనికొచ్చే లాగా ఉంది. త్వరలో ఈ చిత్రం విడుదలకి సంబందించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

First Published:  25 April 2019 10:01 PM GMT
Next Story