బన్నీ సినిమా కథ ఇదేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడో సినిమా ఇది.

తాజాగా ఈ చిత్ర షూటింగ్ సెట్స్ పైకి కూడా వెళ్ళింది. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు బన్నీ.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఐకాన్ కనబడుటలేదు’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా కథ గురించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి.

ఈ సినిమా ఒక రోడ్ జర్నీ బ్యాక్ డ్రాప్ తో సాగుతుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కథ మొత్తం బైక్ నేపథ్యంలో సాగుతుందట. బన్నీ బైక్ పోతుందట. దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు అల్లు అర్జున్. కానీ ఇలాంటి కేసులు ఎప్పుడూ వస్తూ ఉండటంతో వారు దీనిని పెద్దగా పట్టించుకోకపోగా వేరే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వమని చెబుతారు.

అలా కొన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన అల్లు అర్జున్ కు చిర్రెత్తుకొచ్చి పోలీసులతో నే మైండ్ గేమ్ మొదలుపెడతాడు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ పూజా హెగ్డే  కలిసి ప్రేమలో పడతాడు. స్క్రిప్ట్ బాగా నచ్చడంతో బన్నీ ఈ సినిమాకు వెంటనే ఓకే చెప్పేసినట్లు గా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కథ గురించి అధికారిక ప్రకటన మాత్రం బయటకు రాలేదు.