జైసింహా కాంబో మళ్లీ వస్తోంది

బాలయ్య, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో గతంలో జైసింహా సినిమా వచ్చింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. కాకపోతే అదే సీజన్ లో వచ్చిన మిగతా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో జైసింహాకు ప్లస్ అయింది. వసూళ్లు బాగానే వచ్చాయి. అందుకేనేమో.. ఈ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మాతగా కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు బాలయ్య. వచ్చే నెలలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమౌతుంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ పేరుతో పాటు మిగతా టెక్నీషియన్స్ వివరాల్ని వెల్లడిస్తారు.

ఈ మొత్త ఎపిసోడ్ లో బుక్ అయిన దర్శకుడు ఎవరంటే అది బోయపాటి శ్రీను మాత్రమే. అవును.. బాలయ్యతో సినిమా కోసం ఈ దర్శకుడు దాదాపు 3 నెలలుగా వెయిట్ చేస్తున్నాడు. కథ, స్క్రీన్ ప్లే మొత్తం పూర్తిచేశాడు. బాలయ్యతోనే సినిమా ఉంటుందని మీడియాకు ఘనంగా ప్రకటించుకున్నాడు కూడా. కానీ బాలకృష్ణ మాత్రం బోయపాటిని కాదని కేఎస్ రవికుమార్ కు ఛాన్స్ ఇచ్చాడు.