Telugu Global
NEWS

బేరసారాలకు సిద్ధమవుతున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో బేరసారాల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ప్రజా ప్రతినిధులను అడ్డగోలుగా కొనుగోలు చేయడంలో సిద్ధహస్తులైన అధికార పార్టీ…. శాసనసభ ఎన్నికలలో హంగు వస్తుందేమోనని భయంతో బేరసారాల అంకానికి తెర తీసినట్లు గా చెబుతున్నారు. శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పోటీ పడ్డాయి. వీటిలో తెలుగుదేశం, వైసీపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు జరిగింది. కొన్ని స్థానాలలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా గట్టి పోటీ ఇచ్చిందని అంటున్నారు. ఇలాంటి […]

బేరసారాలకు సిద్ధమవుతున్న చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్ లో బేరసారాల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ప్రజా ప్రతినిధులను అడ్డగోలుగా కొనుగోలు చేయడంలో సిద్ధహస్తులైన అధికార పార్టీ…. శాసనసభ ఎన్నికలలో హంగు వస్తుందేమోనని భయంతో బేరసారాల అంకానికి తెర తీసినట్లు గా చెబుతున్నారు.

శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పోటీ పడ్డాయి. వీటిలో తెలుగుదేశం, వైసీపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు జరిగింది. కొన్ని స్థానాలలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కూడా గట్టి పోటీ ఇచ్చిందని
అంటున్నారు.

ఇలాంటి రాజకీయ నేపథ్యంలో తమకు మెజారిటీ స్థానాలు దక్కవేమోననే తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అలా తమకు మెజారిటీ స్థానాలు రానిపక్షంలో గెలిచిన ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాలని ఇప్పటినుంచే అటువైపు అడుగులు వేస్తోంది. గత అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పుకున్నట్లుగానే ఈసారి కూడా అలాగే చేయాలని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీకి 10-15 స్థానాలు వస్తాయని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు ఆశిస్తున్నట్లు గానే జరిగితే ఆ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. కొందరికి మంత్రి పదవుల ఆశ చూపడం, మరికొందరికి డబ్బు ముట్టచెప్పడం వంటి బేరసారాలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలకు ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచార సభలో మాట్లాడడం తో… ఆ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులను తమ వైపు తిప్పుకోవడం సులువేనని తెలుగుదేశం నాయకుల భావన గా చెబుతున్నారు.

ఎన్నికలు జరిగిన అనంతరం పరిస్థితులను గమనిస్తున్న వారు మాత్రం హంగ్ వచ్చే సూచనలు కనిపించడం లేదని, ఆంధ్రప్రదేశ్ లో కచ్చితంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి విజయం దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసినప్పటికీ చివరి ప్రయత్నాలకు తెర తీస్తున్నారని వారు అంటున్నారు.

First Published:  26 April 2019 12:56 AM GMT
Next Story