ఆర్గాన్ డొనేషన్ కాన్సెప్ట్ తో…. నితిన్

‘శ్రీనివాస కల్యాణం’ సినిమాతో ఫ్లాప్ అందుకున్న హీరో నితిన్ ప్రస్తుతం ‘చలో’ ఫేమ్ వేణు దర్శకత్వంలో ‘భీష్మ’ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ సినిమా పూర్తయిన తర్వాత నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టనున్నాడు. 2019 ఆఖరులో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. ఇక ఈ సినిమా 2020 లో విడుదల కానుంది. నితిన్ హోమ్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమా ఆర్గాన్ డొనేషన్ కాన్సెప్ట్ మీద నడుస్తుందని తెలుస్తోంది. అంతేకాక ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఈ సినిమాలో బోలెడన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నాయని అవి కచ్చితంగా ప్రేక్షకుల కళ్ళల్లో కన్నీరు తెప్పించే విధంగా ఉంటాయని తెలుస్తోంది.

ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే నితిన్ …. స్క్రిప్ట్ సెలక్షన్ లో మార్పు చూపిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలతో నితిన్ ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.