చెన్నై చెపాక్ లో ఐపీఎల్ బిగ్ ఫైట్

  • రాత్రి 8 గంటలకు సూపర్ కింగ్స్ తో ముంబై ఢీ
  • చెన్నై పై ముంబై 14-11 రికార్డు

ఐపీఎల్ 12వ సీజన్లో మరో బిగ్ ఫైట్ కి…చెన్నై చెపాక్ స్టేడియంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ డూ ఆర్ డై ఫైట్ లో…డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కు…మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ సవాల్ విసురుతోంది.

ప్లే ఆఫ్ రౌండ్లో ఇప్పటికే చోటు ఖాయం చేసుకొన్న చెన్నై… తొలి అంచె పోటీలో ఎదురైన ఓటమికి… ముంబై పై బదులు తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది.

ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన 11 రౌండ్లలో 8 విజయాలు, 3 పరాజయాలతో 16 పాయింట్లు సాధించడం ద్వారా చెన్నై టేబుల్ టాపర్ గా నిలిచింది. అంతేకాదు హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియంలో ఆడిన గత 17 రౌండ్ల మ్యాచ్ ల్లో 16 విజయాలు సాధించిన ధోనీఆర్మీ… 17వ విజయానికి ఉరకలేస్తోంది.

మరోవైపు…రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్10 రౌండ్లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించినా ఇప్పటికీ ప్లేఆఫ్ రౌండ్ బెర్త్ ఖాయం చేసుకోలేకపోయింది. మిగిలిన నాలుగు రౌండ్లలో.. ముంబై రెండు విజయాలు సాధించినా క్వాలిఫైయర్స్ రౌండ్ చేరుకోగలుగుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్ జోరును…ముంబై ఇండియన్స్ ఏవిధంగా అడ్డుకోగలదో…తెలుసుకోవాలంటే…మ్యాచ్ ముగిసే వరకూ ఎదురుచూడక తప్పదు.