’96’ రీమేక్ విషయంలో దిల్ రాజు సంచలన నిర్ణయం!

విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ’96’ సినిమా తమిళంలో క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రీమేక్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు. సమంత మరియు శర్వానంద్ లను హీరో హీరోయిన్లుగా ఇప్పటికే ప్రకటించేశాడు. ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే తాజాగా తెలుగు రీమేక్ వెర్షన్ కోసం దిల్ రాజు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయమై ప్రేమ్ కుమార్ కి దిల్ రాజు కి మధ్య తేడాలొ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సీన్ల షూటింగ్ కూడా పూర్తయింది.

ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు ఇక ఈ సినిమా షూటింగ్ లో జోక్యం చేసుకోకపోవడం మంచిదని నిర్ణయించుకున్నాడట.

నిజానికి టాలీవుడ్ లో ఉన్న టాప్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ప్రతి సినిమాకు ఆది నుండి తుది వరకు అన్ని విషయాలను దగ్గరుండి చూసుకుంటారు.

కానీ ’96’ రీమేక్ విషయంలో ఈ నిర్ణయానికి రావడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. మరి దిల్ రాజు ఈ సినిమా గురించి పట్టించుకోకపోవడం ఈ సినిమా పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.