జెర్సీ మొదటి వారం వసూళ్లు

నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాకు సోమవారం నుంచి వసూళ్లు తగ్గిన విషయం తెలిసిందే. కాంచన-3 వల్ల ఈ సినిమాకు కలెక్షన్ తగ్గింది. మొదటి 3 రోజుల్లో 10 కోట్లు సంపాదించిన ఈ సినిమా.. మిగతా 4 రోజుల్లో కేవలం 5 కోట్లు మాత్రం వసూళ్లు సాధించింది. అలా 7 రోజుల్లో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందనుకున్న ఈ సినిమా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 20 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం మరో 6 కోట్ల రూపాయలు కావాలి. రెండో వారంలో ఈ సినిమా 6 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది డౌట్. ఇక ఏపీ, నైజాంలో ఈ సినిమాకు వారం రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

ఏపీ,నైజాం 7 రోజుల షేర్లు

నైజాం – రూ. 7.05 కోట్లు
సీడెడ్ – రూ. 1.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.75 కోట్లు
ఈస్ట్ – రూ. 1.20 కోట్లు
వెస్ట్ – రూ. 0.99 కోట్లు
గుంటూరు – రూ. 1.12 కోట్లు
నెల్లూరు – రూ. 0.50 కోట్లు
కృష్ణా – రూ. 1.06 కోట్లు