మరో సినిమా సిద్ధంచేసిన కార్తికేయ

ఆర్ఎక్స్ 100 సినిమాతో సక్సెస్ కొట్టిన కార్తికేయ, అదే ఊపులో హిప్పీ సినిమాను పూర్తిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హీరో మరో సినిమాను కూడా కొలిక్కి తీసుకొచ్చాడు. అర్జున్ జంధ్యాల అనే వ్యక్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు కార్తికేయ. ఈ మూవీ షూటింగ్ 70శాతానికి పైగా పూర్తయింది. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. గుణ369 అనే పేరుపెట్టారు. టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు.

సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒంగోలులో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ నెల 29 నుంచి మే 15 వ‌ర‌కు మ‌రో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తో ఒక సాంగ్ మిన‌హా సినిమా మొత్తం పూర్త‌వుతుంది. ప్రస్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఇటీవ‌లే క్రొయేషియాలో 2 పాట‌లు తీశారు. ఇలా శరవేగంగా సినిమాను పూర్తిచేస్తున్నారు.

చైతన్య భరధ్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. హిప్పీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత గుణ369 విడుదల ఉంటుంది.