మళ్ళీ మెగా హీరోలతో అనసూయ ?

అనసూయ భరద్వాజ్.  కేవలం బుల్లితెరమీద మాత్రమే కాక వెండి తెరపై కుడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ వస్తోంది అనసూయ.

నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై చిన్నపాత్రలో కనిపించిన అనసూయ ఆ తర్వాత ‘క్షణం’, ‘గాయత్రి’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది.

ఇక రంగమ్మత్తగా ‘రంగస్థలం’లో ఆమె నటనతో అందరినీ మెప్పించింది. ఒకవైపు నటిగా మరో వైపు పాటల్లోనూ తన గ్లామర్‌ ఆరబోస్తోంది ఈ ‘జబర్దస్త్’ బ్యూటీ. ‘సచ్చిందిరా గొర్రె’, ‘కథనం’ వంటి సినిమాల్లో అనసూయ లీడ్ రోల్స్ లో నటిస్తోంది.

2017లో విడుదలైన సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’లో తన పేరు మీద నడిచే పాటకి డాన్స్ చేసిన అనసూయ ‘ఎఫ్ 2’ లోనూ కీలక పాత్రలో కనిపించింది. త్వరలో అనసూయకు మరో ఇద్దరు మెగా హీరోలతోనూ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలోనూ, అలాగే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించనున్న సినిమాలోనూ అనసూయకి కీలక పాత్రలు దక్కాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

మొత్తానికి అనసూయ బుల్లి తెరమీదే కాక ఇప్పుడు స్టార్ హీరో లతో వెండితెరపై కూడా మెరుస్తోంది.