Telugu Global
Health & Life Style

 బొప్పాయ్.... ఔషధ గుణాలున్నాయి !

ఇతర పళ్లతో పోలిస్తే బొప్పాయిలో ఔషధ గుణాలు అధికం. ప్రతి రోజూ బొప్పాయి పచ్చిది లేదా పండు తింటే శరీరంలో అనేక రుగ్మతలు తగ్గి ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. బొప్పాయిని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అంతటి విశిష్టత ఉన్న బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం. బొప్పాయి లో ఉన్న ఫైబ్రిన్ అనే పదార్దం శరీరంలో బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. బ్లడ్ క్లాట్స్ వల్ల గుండె జబ్బులు […]

 బొప్పాయ్.... ఔషధ గుణాలున్నాయి !
X

ఇతర పళ్లతో పోలిస్తే బొప్పాయిలో ఔషధ గుణాలు అధికం. ప్రతి రోజూ బొప్పాయి పచ్చిది లేదా పండు తింటే శరీరంలో అనేక రుగ్మతలు తగ్గి ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. బొప్పాయిని ప్రతిరోజు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. అంతటి విశిష్టత ఉన్న బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.

  • బొప్పాయి లో ఉన్న ఫైబ్రిన్ అనే పదార్దం శరీరంలో బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. బ్లడ్ క్లాట్స్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బొప్పాయి రక్త సరఫరాను మెరుగు పరచి ఈ సమస్యను నివారిస్తుంది.
  • బొప్పాయిలో విటమిన్ ఏ, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉన్న బ్యాక్టీరీయాను అరికడుతుంది.
  • బొప్పాయి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
  • పేగులను శుభ్రపరచి వ్యర్దాలను బయటకి పంపడంలో బొప్పాయి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
  • ఇందులో ఉన్న ప్రొటీన్లు, ఖనిజాలు, విటమన్లు పిరాడికల్స్ ద్వారా ఏర్పడే సమస్యలను అరికడతాయి.
  • తరచూ జలుబు, జ్వరం, ఫ్లూ తో బాధపడే వారికి బొప్పాయి పండు మంచి ఔషధం. బొప్పాయి లో రోగనిరోధక శక్తి గుణాలు జలుబు, జ్వరం అరికడుతాయి.
  • చర్మ సౌందర్యానికి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. చిన్న వయస్సులోనే శరీరం ముడతలు పడడాన్ని నివారించి.. చర్మానికి మంచి కాంతినిస్తుంది.
  • చర్మంలో తేమను కాపాడడంలో బొప్పాయిది కీలక పాత్ర. దీని వల్ల చర్మ సమస్యలు దరిచేరవు.
  • బొప్పాయి కంటి చూపును మెరుగు పరుస్తుంది. క్యాటరాక్ట్, చత్వారం వంటివి దరి చేరవు.
  • బొప్పాయిలో ఉన్న పీచు మల బద్దాకాన్ని నివారించి. సుఖవిరోచనం అయ్యేందుకు తోడ్పుతుంది.
First Published:  25 April 2019 8:51 PM GMT
Next Story