ప్రభాస్ కామెంట్లపై రియాక్ట్ అయిన షాహిద్

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా తెలుగు లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇప్పుడు అదే సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్, కీయార అద్వానీ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా సందీప్ రెడ్డి హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్ర టీజర్ ను బాహుబలి స్టార్ ప్రభాస్ కు చూపించారు. ఇంప్రెస్ అయిన ప్రభాస్ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ నేపధ్యంలో తాజాగా ప్రభాస్ గురించి షాహిద్ మాట్లాడారు.”ఈ మధ్యనే ప్రభాస్ తో మాట్లాడాను. తను చాలా మంచి వ్యక్తి. ప్రభాస్ మాకు ఎప్పుడూ మహేంద్ర బాహుబలి గానే గుర్తుంటాడు. తన నుంచి ప్రశంసలు అందుకోవడం చాలా ఎంకరేజింగ్ గా అనిపించింది. ఎందుకంటే చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులకు తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎలాంటి ఐకానిక్ సినిమానో తెలిసి ఉండకపోవచ్చు” అని చెప్పుకొచ్చాడు షాహిద్.

జూన్ 21 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. అదే రోజున కంగనారనౌత్ ‘మెంటల్ హై క్యా’ సినిమా కూడా విడుదల కాబోతోంది. సినిమాకి కాంపిటేషన్ ఉన్నప్పటికి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అని షాహిద్ కపూర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.