ఐపీఎల్ ప్లేఆఫ్ రౌండ్ కు చేరువగా ముంబై

  • చెన్నై సూపర్ కింగ్స్ పై 46 పరుగుల విజయం
  • హిట్ మాన్ రోహిత్ షోతో ముంబై షో

ఐపీఎల్ 12వ సీజన్ ప్లే ఆఫ్ రౌండ్ కు మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ చేరువయ్యింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ విజయాలఅడ్డా చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన 11వ రౌండ్ పోటీలో ముంబై 46 పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తు చేసి…పాయింట్ల సంఖ్యను 14కు పెంచుకొంది.

ఈ కీలక మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్లకు 155 పరుగుల స్కోరు సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 48 బాల్స్ లో 6 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 67 పరుగుల స్కోరుతో టాప్ స్కోరర్ నిలిచాడు.

కెప్టెన్ ధోనీ లేకుండా రైనా నాయకత్వంలో చేజింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ …17.4 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. ఆల్ రౌండర్ సాంట్నర్ 22 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ముంబై బౌలర్లలో మలింగ 4 వికెట్లు, హార్థిక్ పాండ్యా, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ముంబై విజయంలో ప్రధానపాత్ర వహించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 11 రౌండ్లలో ముంబైకి ఇది ఏడో విజయం కాగా…12 రౌండ్లలో చెన్నైకి ఇది నాలుగో పరాజయం.

చెపాక్ స్టేడియం వేదికగా గత 17 మ్యాచ్ ల్లో 16 విజయాలు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ కు…ఇది రెండో ఓటమి కావడం విశేషం. రెండు కు రెండు పరాజయాలు ముంబై చేతిలోనే ఎదురయ్యాయి.