Telugu Global
National

ఆలుగడ్డలు పండించినందుకు రైతులపై కేసు

విదేశీ విష సంస్కృతి అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఇలా ఉంటుంది. విషాన్ని నింపేది బట్టల్లో కాదు బతుకుల్లో. ఆవుమాంసాన్ని తింటే చంపేస్తాం అనే వాళ్ళకి వేల ఏళ్లుగా అది ఈ దేశంలో ఉందని తెలుసు. కానీ సీసాల్లో నిండిన కూల్డ్రింక్ కొనటం ఏమాత్రం తప్పుగా అనిపించదు. ఒక్కరోజులో లక్షల లీటర్ల భూగర్భ జలాలు తోడి, పసిపిల్లల ఆరోగ్యాలకి హాని చేసే కూల్ డ్రింక్ కొనొచ్చు, వ్యవసాయంలో పశువుల్ని ఉపయోగించే అవసరం తీరగానే ఒంగోలు జాతి ఎద్దులని […]

ఆలుగడ్డలు పండించినందుకు రైతులపై కేసు
X

విదేశీ విష సంస్కృతి అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఇలా ఉంటుంది. విషాన్ని నింపేది బట్టల్లో కాదు బతుకుల్లో. ఆవుమాంసాన్ని తింటే చంపేస్తాం అనే వాళ్ళకి వేల ఏళ్లుగా అది ఈ దేశంలో ఉందని తెలుసు. కానీ సీసాల్లో నిండిన కూల్డ్రింక్ కొనటం ఏమాత్రం తప్పుగా అనిపించదు. ఒక్కరోజులో లక్షల లీటర్ల భూగర్భ జలాలు తోడి, పసిపిల్లల ఆరోగ్యాలకి హాని చేసే కూల్ డ్రింక్ కొనొచ్చు, వ్యవసాయంలో పశువుల్ని ఉపయోగించే అవసరం తీరగానే ఒంగోలు జాతి ఎద్దులని కోల్పోయిన మనం. ఆ బ్రీడ్ ఇప్పుడు బ్రెజిల్ లో, స్పెయిన్ లో మాత్రం ఎలా అభివృద్ధి అయ్యి అక్కడ నిలబడింది అని ఆలోచించలేకపోయినట్టే…. ఇప్పుడూ ఈ గుజరాత్ రైతులగురించి కూడా పెద్దగా ఆలోచించమా??

ఈ నెల మొదటి వారంలో గుజరాత్ క్యాపిటల్ అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో. పెప్సీ ఇండియా కంపెనీ వేసిన ఓ వ్యాజ్యం (Law Suit) ఫలితంగా సాబర్ కాoఠా జిల్లాలో రైతులైన బిపిన్ పటేల్,ఛాబిల్ పటేల్, వినోద్ పటేల్, హరిభాయ్ పటేల్ లాంటి అనేక మంది రైతులు ఈ ఆలూ ని పండించినందుకు దోషులయ్యారు, వీళ్ళతో సహా మరికొన్ని వందల మంది రైతులు అసలు ఆ పంట పండించే హక్కుని కోల్పోయారు. పుట్టిన దగ్గరినుంచీ ఆ రైతులకు తెలిసింది బంగాళా దుంపలని (ఆలుగడ్డలు) పండించటం మాత్రమే. ఇప్పటికిప్పుడు విదేశీ కంపెనీ, స్వదేశీ కోర్టూ వాళ్ళ తిండి వాళ్ళు పండించవద్దని ఎందుకు చెప్తున్నాయో అర్థం కాని ఈ గొప్పదేశపు అన్నదాతలు వాళ్ళు.

గుజరాత్‌లో FL-2027 రకమైన దుంపల సాగు, అమ్మకం జరిపేందుకు అనుమతి రద్దైంది. కానీ ఆ దుంపలని వాళ్ళు ఆ నేలల్లో కొన్ని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ హక్కుని కోల్పోయారు. తమ ఆహారాన్ని తాము పండించటం ఇప్పుడు నేరం అయిపోయింది..

బేవరేజెస్,జంక్ ఫుడ్ తయారీలో పేరుపొందిన “పెప్సీ ఇండియా”కంపెనీ (పేరులోనే ఇండియా ఉంటుంది పెప్సీ ఎక్కడి కంపెనీనో మనకు తెలుసు) తాము ఉత్పత్తి చేస్తున్న “లేస్ చిప్స్” తయారీలో ఆ దుంపలనే రిజిస్టర్ (FL-2027) చేసుకున్నామనీ. కాబట్టి ఆ దుంప జాతిని చుట్టుపక్కల రైతులెవరూ ఇప్పుడు పండించకూడదని ఆ వ్యాజ్యంలో పేర్కొంది. అలా ఆ బంగాళాదుంపలని పండిస్తున్న రైతులపై కోర్టులో కేసు వేసింది. ఇప్పుడు వారిలో ఒక్కో రైతు తమకు కోటీ ఐదు లక్షల నష్టపరిహారం చెల్లించాలని పెప్సీ కంపనీ డిమాండ్ చేస్తోంది. (మరి ఈదేశ సహజవనరులని పీల్చి పిప్పి చేస్తున్న కంపెనీ మనకెంత నష్టపరిహారం ఇవ్వాలి? మన నీళ్లు, మన భూముల్ని నిర్వీర్యం చేస్తూ, వ్యాపార రాయితీలని కూడా ప్రభుత్వాలనుంచి పొంది మరీ ఇక్కడ వ్యాపారం చేస్తున్న కంపెనీలు ఆ రైతుల రాబోయే తరాలకు ఎన్ని కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి?)

రైతుల తరపున పోరాడుతున్న హక్కుల సంఘాలు. (వీటినే కొందరు సంఘవిద్రోహ సంఘాలు, టెర్రరిస్టు సంఘాలూ అని దేశానికి ఇవి ప్రమాదకరం అని, విదేశీ సంస్కృతిని ఇక్కడ తెస్తున్నారని చెప్తూఉంటారు). కేంద్రానికి లేఖ రాశాయి. కోర్టు కేసుల నుంచీ రైతుల్ని కాపాడాలనీ, కేసులు విత్ డ్రా చేసుకునేలా చెయ్యాలని కోరుతూ మొత్తం 192 మంది కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. అంతేకాదు. స్థానిక జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, సంబంధిత రైతు అనుమతి లేకుండా వారి పొలాల్లోకి ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు వెళ్లే అవకాశం లేకుండా చెయ్యాలని లేఖలో కోరారు. అయితే ఈ అభ్యర్థనలకు ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన సమాధానం రాలేదు కానీ…. పెప్సీ ఇండియా కంపెనీ అభ్యర్థనపై మాత్రం కోర్టు ఓ లాయర్‌ను కోర్టు కమిషనర్‌గా నియమించింది. ఇప్పుడు ఆయనగారూ ఈ వివాదంపై దర్యాప్తు జరిపి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. ఇది జరగటానికి ఎన్ని రోజులు పడుతుందో, దానివల్ల ఆ రైతులకు ఎంత న్యాయం జరగనుందో మనం ఇప్పుడే చెప్పేయగలం.

పెప్సీ ఇండియా ఇలా రైతులమీద కేసులు వేయటం మొదటిసారి కాదు 2018లో కూడా ఇలాంటి కేసుల్లో ఉన్న రైతులు ఇంకా కొందరున్నారు. ఇప్పుడు మనమేం చేయగలం? గుజరాత్ వెళ్లి రైతుల పక్కన నిలబడే అవసరం లేదు కానీ. ఆ కంపెనీ ఉత్పత్తులని వ్యతిరేకించగలం పెప్సీ ఇండియాతో సహా ఈ మల్టీనేషనల్ కంపెనీల కూల్డ్రింక్స్, చిప్స్ వంటి ఉత్పత్తులని వాడటం ఆపేస్తే…. (పెట్రోల్, భోజనం, ఫోన్, ఇంటర్నెట్ ఇవి కాదు కేవలం కూల్ డ్రింక్స్, ఆలూ చిప్స్ మాత్రమే అవీ పెప్సీ ఇండియా కంపెనీవి మాత్రమే ఆపటం పెద్ద కష్టం కాదేమో)

(సోర్స్‌… అవనీ న్యూస్‌. కామ్‌)

First Published:  27 April 2019 4:12 AM GMT
Next Story