Telugu Global
Cinema & Entertainment

నిర్మాతగా మారనున్న దుల్కర్ సల్మాన్

మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి తనయుడిగా మాత్రమే కాక తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తక్కువ సమయంలోనే ఏర్పరుచుకున్నాడు దుల్కర్ సల్మాన్. కేవలం మలయాళం లో మాత్రమే కాక తెలుగు, తమిళం ఇంకా హిందీ భాషల్లో కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు దుల్కర్. ఇప్పటిదాకా నటుడిగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్…. ఇప్పుడు నిర్మాతగా మారనున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]

నిర్మాతగా మారనున్న దుల్కర్ సల్మాన్
X

మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి తనయుడిగా మాత్రమే కాక తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను తక్కువ సమయంలోనే ఏర్పరుచుకున్నాడు దుల్కర్ సల్మాన్.

కేవలం మలయాళం లో మాత్రమే కాక తెలుగు, తమిళం ఇంకా హిందీ భాషల్లో కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు దుల్కర్. ఇప్పటిదాకా నటుడిగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్…. ఇప్పుడు నిర్మాతగా మారనున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాను నిర్మాతగా మారబోతున్న విషయాన్ని దుల్కర్ సల్మాన్ స్వయంగా తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని తన మొట్టమొదటి ప్రొడక్షన్ సినిమా కోసం కాస్టింగ్ కాల్ ను ప్రకటించాడు దుల్కర్ సల్మాన్.

ఇక మరొకవైపు దుల్కర్ సల్మాన్ చాలా కాలం తర్వాత మళ్లీ మలయాళంలో ఒక సినిమా చేశాడు. కొత్త దర్శకుడు బిసి నౌఫాల్ తెరకెక్కించిన ‘ఓరు యమందన్ ప్రేమ కథ’ సినిమా ఈమధ్యనే విడుదలైంది. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమా కాకుండా దుల్కర్ సల్మాన్ హిందీలో కూడా ‘ది జోయ ఫాక్టర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. సోనం కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ లో విడుదల కానుంది.

First Published:  26 April 2019 11:19 PM GMT
Next Story