Telugu Global
Cinema & Entertainment

బాలకృష్ణతో రవికుమార్.... యువహీరోతో బోయపాటి

ఈ మధ్యనే రామ్ చరణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను తన తర్వాతి సినిమాను నందమూరి బాలకృష్ణ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకుంటూ కనిపించిన బోయపాటి బాలయ్యతో తన తదుపరి సినిమా ‘సింహ’, ‘లెజెండ్’ లాగానే బ్లాక్ బస్టర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని నందమూరి […]

బాలకృష్ణతో రవికుమార్.... యువహీరోతో బోయపాటి
X

ఈ మధ్యనే రామ్ చరణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాతో అతి పెద్ద డిజాస్టర్ ను అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను తన తర్వాతి సినిమాను నందమూరి బాలకృష్ణ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.

తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకుంటూ కనిపించిన బోయపాటి బాలయ్యతో తన తదుపరి సినిమా ‘సింహ’, ‘లెజెండ్’ లాగానే బ్లాక్ బస్టర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో నందమూరి బాలకృష్ణ కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా అని ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశారు.

కేఎస్ రవి కుమార్ సినిమా జూన్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే బాలయ్య కేఎస్ రవి కుమార్ తో ‘జై సింహా’ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఇంతకీ బోయపాటి శ్రీను సినిమా ఏమైంది అన్న సందేహాలు బయటకు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం బాలయ్య కేఎస్ రవి కుమార్ తో సినిమా పూర్తి చేసే లోపల బోయపాటి ఒక యువ హీరో తో మరొక సినిమాను చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దసరా వరకు పూర్తి చేసి బాలయ్య సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువ హీరో ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

First Published:  27 April 2019 1:41 AM GMT
Next Story