Telugu Global
Cinema & Entertainment

కాంచన-3 కుమ్మేసింది

చాపకింద నీరు, స్లో పాయిజన్, సైలెంట్ కిల్లర్.. ఇలా ఎన్ని ఉపమానాలైనా వాడుకోవచ్చు. అవును.. ఎవరూ ఊహించని విధంగా సూపర్ హిట్ అయింది కాంచన-3 సినిమా. ఏమాత్రం పోటీలేదనుకున్న జెర్సీ సినిమాకు పక్కలో బల్లెంలా మారింది. ఈ సినిమా దెబ్బకు ఉత్తరాంధ్రతో పాటు సీడెడ్ లోని చాలా సెంటర్లలో జెర్సీ డల్ అయిపోయింది. అంతెందుకు, ఒక్క ముక్కలో చెప్పాలంటే సీడెడ్ లో జెర్సీ కలెక్షన్లు కంటే కాంచన-3 వసూళ్లే ఎక్కువ. వారం తిరిగేసరికి లెక్కలు మారిపోయాయి. కలెక్షన్లు […]

కాంచన-3 కుమ్మేసింది
X

చాపకింద నీరు, స్లో పాయిజన్, సైలెంట్ కిల్లర్.. ఇలా ఎన్ని ఉపమానాలైనా వాడుకోవచ్చు. అవును.. ఎవరూ ఊహించని విధంగా సూపర్ హిట్ అయింది కాంచన-3 సినిమా. ఏమాత్రం పోటీలేదనుకున్న జెర్సీ సినిమాకు పక్కలో బల్లెంలా మారింది. ఈ సినిమా దెబ్బకు ఉత్తరాంధ్రతో పాటు సీడెడ్ లోని చాలా సెంటర్లలో జెర్సీ డల్ అయిపోయింది. అంతెందుకు, ఒక్క ముక్కలో చెప్పాలంటే సీడెడ్ లో జెర్సీ కలెక్షన్లు కంటే కాంచన-3 వసూళ్లే ఎక్కువ.

వారం తిరిగేసరికి లెక్కలు మారిపోయాయి. కలెక్షన్లు తారుమారయ్యాయి. జెర్సీ వసూళ్లతో ఎడ్జ్ టు ఎడ్జ్ దూసుకెళ్తోంది కాంచన-3. నైజాంలో జెర్సీ హవా కొనసాగుతుంటే.. సీడెడ్ లో కాంచన-3 దూసుకుపోతోంది. అటు ఉత్తరాంధ్రలో కూడా కాంచన-3దే హవా. నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల పాతిక లక్షల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కాంచన-3 వారం రోజుల షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 4.60 కోట్లు
సీడెడ్ – రూ. 3.28 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.68 కోట్లు
ఈస్ట్ – రూ. 1.21 కోట్లు
వెస్ట్ – రూ. 0.89 కోట్లు
గుంటూరు -రూ. 1.07 కోట్లు
కృష్ణా – రూ. 1.04 కోట్లు
నెల్లూరు – రూ. 0.49 కోట్లు

First Published:  26 April 2019 9:07 PM GMT
Next Story