Telugu Global
NEWS

బాబుకి గడ్డుకాలమా?

తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట ఊపిరి పోసుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గడ్డు కాలం వచ్చినట్టేనా? దీనికి రాజకీయ పరిశీలకులు ఔననే సమాధానం చెబుతున్నారు. అసలు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిలో పడి ఏనాడో కలుషితం అయ్యిందనే అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. 2014 ఎన్నికలలోనే ఆ పార్టీ కనుమరుగవుతుందని పలువురు భావించారు. కానీ, ప్రజలు అనుభవమున్ననేత అనుకున్నారో ఏమో.. చంద్రబాబుకు మరో అవకాశం ఇచ్చారు. కానీ, చంద్రబాబు ఈ ఐదేళ్ల పాలనలో ప్రజల అభిమానాన్ని […]

బాబుకి గడ్డుకాలమా?
X

తెలుగు ప్రజల ఆత్మగౌరవం పేరిట ఊపిరి పోసుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు గడ్డు కాలం వచ్చినట్టేనా? దీనికి రాజకీయ పరిశీలకులు ఔననే సమాధానం చెబుతున్నారు. అసలు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు చేతిలో పడి ఏనాడో కలుషితం అయ్యిందనే అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి.

2014 ఎన్నికలలోనే ఆ పార్టీ కనుమరుగవుతుందని పలువురు భావించారు. కానీ, ప్రజలు అనుభవమున్ననేత అనుకున్నారో ఏమో.. చంద్రబాబుకు మరో అవకాశం ఇచ్చారు. కానీ, చంద్రబాబు ఈ ఐదేళ్ల పాలనలో ప్రజల అభిమానాన్ని పోగొట్టుకున్నారు.

అంతులేని ప్రభుత్వ అవినీతి, రాజధాని అమరావతి నిర్మాణాలు, భూముల వ్యవహారాలు, జన్మభూమి కమిటీల నిర్వాకాలు, పలువురు ఎమ్మెల్యేల దాష్టికాలు, కిందిస్థాయి నేతలు, కార్యకర్తల దౌర్జన్యాలు టీడీపీకి చెడ్డ పేరు తెచ్చి పెట్టాయని అంటున్నారు. ఈ అంశాలన్నీ పోలింగ్ లో ప్రతిఫలించాయని చెబుతున్నారు. అదే జరిగి తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరం అయితే భవిష్యత్తు ఇబ్బందికరంగానే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ టీడీపీ హయాంలో జరిగిన అక్రమాలు, అవకతవకల మీద విచారణ అంటూ జరిపితే మరిన్ని ఇబ్బందులు తప్పవని అంటున్నారు. నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిది ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార యంత్రాంగం మీదా, పార్టీ మీదా పట్టు ఉండేదని చెబుతున్నారు. ఈ ఐదేళ్లలో ఆ పరిస్థితి కనిపించలేదని పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్న మాట.

దీనిని అదనుగా తీసుకున్న తెలుగుదేశం నాయకులు ఇష్టానుసారంగా ప్రవర్తించి పార్టీని ఇబ్బందికర పరిణామాలలోకి నెట్టేశారని వారు వాపోతున్నారు. మొదట్లోనే అలాంటి నేతలను నియంత్రించి ఉంటే ఇప్పుడు గెలుపు కోసం ఇంతగా కష్టపడాల్సి వచ్చేది కాదంటున్నారు.

చంద్రబాబు నాయుడి కుమారుడు లోకేశ్ కు పార్టీ వ్యవహారాలు అప్పగించడం…పార్టీ సమావేశాలలో సీనియర్ నాయకులకు అవమానాలు జరగడం కూడా ప్రభావం చూపాయని అంటున్నారు.

ఇవన్నీ గమనించాకే టీడీపీ అధినేత చంద్రబాబు జాతీయ రాజకీయాల మీద దృష్టి సారించారని, రేపు ఎటుపోయి ఎటు వచ్చినా తనకు రక్షణ ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని అంటున్నారు.

First Published:  28 April 2019 5:24 AM GMT
Next Story