బ్రకోలి…. అందరూ తినాలి….

బ్రకోలి… ఇది ఎక్కువగా చలి ప్రదేశాలలో పెరుగుతుంది. భారతదేశంలో దీనిని శీతకాలంలో మాత్రమే సాగు చేస్తారు. క్యాబేజీ జాతికి చెందిన ఈ బ్రకోలిని సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

బ్రకోలిలో ఎన్ని ఔషధ గుణాలున్నాయో గతంలో తెలియదు కానీ… నేటి ప్రజలు తెలుసుకున్నారు. అందుకే ఇటీవల బ్రకోలీ పట్ల ప్రజల్లో ఇష్టం పెరిగింది. ఎన్నో ఆరోగ్య గుణాలున్న బ్రకోలీ గురించి తెలుసుకుందాం.

  • బ్రకోలి శరీరంలో ఉన్న బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
  • ఇది కడుపులో ఉన్న క్రిములను నశింప చేస్తుంది. పేగుల్ని శుభ్ర పరుస్తుంది. జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది.
  • కడుపులో ఉన్న వ్యర్దాలను బయటకి పంపడానికి తోడ్పడుతుంది.
  • బ్రకోలిలో విటమిన్ ఇ, విటమిన్ బి5 పుష్కలంగా ఉన్నాయి.
  • శరీరంలో ఉన్న కొవ్వును తగ్గించి, శరీరాన్ని తేలికపరచాలంటే బ్రకోలి చక్కని ఔషధం.
  • ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, ఇతర ఖనిజాలు ప్రీరాడికల్స్ ను నివారిస్తాయి.
  • బ్రకోలిలో ఉన్న మెగ్నీషియం, పొటాషియం నాడి వ్యవస్ద మీద బాగా పని చేస్తాయి. తరచుగా బ్రకోలి తినే వారికి సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ యాక్టీవ్ గా పనిచేస్తుంది.
  • బ్రకోలిలో ఉన్న సల్సోరిపోన్… శరీరంలో ఉన్న ఎంజైములకు ఎటువంటి హానీ కలగకుండా కాపాడుతుంది.
  • బ్రకోలిలో ఉన్న లూటిన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేక రోగాలను అదపు చేస్తాయి.
  • బ్రకోలిలో గ్లూకోరఫినైన్ అనే పదార్దం ఉంది. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. అంతే కాదు అనేక చర్మ సమస్యలను నివారించి.. శరీరం కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
  •  బ్రకోలిలో విటమిన్ సి, విటమిన్ కె తో పాటు ఇతర పోషకాలు బ్రెయిన్ పనితీరును మెరుగు పరచడానికి సహాయపడతాయి. మతిమరపుతో బాధపడుతున్న వారికి బ్రకోలి మంచి ఆహారమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  • సెన్సీటివ్ స్కిన్ లేదా సెన్సీటివ్ బాడీ ఉన్న వారికి బ్రకోలి దివ్యౌషధం. ఇందులో ఉన్న ఓమేగా 3, యాంటీ అలర్జీ గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాక అలర్జీల నుండి రక్షణ కల్పిస్తుంది.
  • మిగతా కూరలతో పోలిస్తే బ్రకోలిలో క్యాల్షియం శాతం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఎముకలు, కండరాల సమస్యతలతో భాధపడుతున్న వారు తరచూ బ్రకోలి తింటే ఆ బాధల నుండి ఉపశమనం పొందుతారని వైద్యులు చెబుతున్నారు.