Telugu Global
National

వారణాసిలో నిజామాబాద్ రైతులకు బెదిరింపులు..!

పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే నినాదంతో రైతులు నిజామాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలకు భారీగా నామినేషన్లు వేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. తాజాగా తమ సమస్యలను మరింత మంది తెలుసుకోవాలనే సంకల్పంతో మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో నామినేషన్లు వేయాలని అక్కడికి చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 50 మంది, నల్లగొండ, ఏపీలోని ప్రకాశం జిల్లా రైతులు వారణాసి చేరుకున్నారు. కాగా, రైతులు నామినేషన్లు వేయకుండా యూపీ ఇంటెలిజెన్స్ […]

వారణాసిలో నిజామాబాద్ రైతులకు బెదిరింపులు..!
X

పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే నినాదంతో రైతులు నిజామాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలకు భారీగా నామినేషన్లు వేసి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.

తాజాగా తమ సమస్యలను మరింత మంది తెలుసుకోవాలనే సంకల్పంతో మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో నామినేషన్లు వేయాలని అక్కడికి చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపు 50 మంది, నల్లగొండ, ఏపీలోని ప్రకాశం జిల్లా రైతులు వారణాసి చేరుకున్నారు.

కాగా, రైతులు నామినేషన్లు వేయకుండా యూపీ ఇంటెలిజెన్స్ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేయకూడదంటూ రైతులను బెదిరించడమే కాక.. వారికి నామినీలుగా ఉంటామని ముందుకు వచ్చిన స్థానిక రైతులను కూడా పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు అడ్డుకుంటున్నారట. ఈ విషయాన్ని తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు చెప్పారు.

ఇక నిజామాబాద్ రైతులకు మద్దతుగా వచ్చిన తమిళనాడు రైతులను స్థానిక పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. అంతే కాక వారిని 24 గంటల పాటు బంధించి బెదిరించారట. వారణాసిలో నామినేషన్లు వేయడానికి కేవలం తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు వచ్చారు.

కావేరీ సమస్యపై తమిళనాడు రైతులు, తాగు, సాగు నీటి సమస్య తీర్చాలంటూ నెల్లూరు, కడప జిల్లా రైతులు వారణాసి చేరుకున్నారు. పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలైతే ఎన్నికలు నిర్వహించడం తలకు మించిన భారమవుతుందని అక్కడి అధికారులు భావించడమే కారణమని తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ నాయకులు, కార్యకర్తల నుంచి కూడా రైతులకు బెదిరింపులు వస్తున్నాయి. రేపటితో వారణాసిలో నామినేషన్ల గడువు పూర్తి కానుంది. మరి రైతుల నామినేషన్లు సక్రమంగా పడతాయా లేదా అనేది చూడాల్సిందే.

First Published:  27 April 2019 11:57 PM GMT
Next Story