Telugu Global
Cinema & Entertainment

అల్లుడి కోసం రజినీకాంత్ పాట్లు

మొన్నామధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ తన రెండో కుమార్తె కి రెండో వివాహం చేశారు. తన కుమార్తె సౌందర్య మొదటి భర్త తో విడాకులు తీసుకున్న అనంతరం చెన్నైకి సంబంధించిన ఒక పెద్ద వాణిజ్య కుటుంబానికి చెందిన విశాగన్ తో వివాహం అయిన విషయం తెలిసిందే. అయితే బిజినెస్ లో రాణించక మునుపు విశాగన్ సినిమాల్లో నటించి తన లక్ ని టెస్ట్ చేసుకున్నాడు. కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు రజినీకాంత్ అల్లుడు […]

అల్లుడి కోసం రజినీకాంత్ పాట్లు
X

మొన్నామధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ తన రెండో కుమార్తె కి రెండో వివాహం చేశారు. తన కుమార్తె సౌందర్య మొదటి భర్త తో విడాకులు తీసుకున్న అనంతరం చెన్నైకి సంబంధించిన ఒక పెద్ద వాణిజ్య కుటుంబానికి చెందిన విశాగన్ తో వివాహం అయిన విషయం తెలిసిందే.

అయితే బిజినెస్ లో రాణించక మునుపు విశాగన్ సినిమాల్లో నటించి తన లక్ ని టెస్ట్ చేసుకున్నాడు. కానీ అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు రజినీకాంత్ అల్లుడు గా మారిన నేపథ్యం లో, మళ్ళీ సినిమాల్లో కి ప్రవేశించాలన్న తపన తో ఉన్నాడు విశాగన్.

ఎలా అయితే చిరంజీవి తన కుమార్తె శ్రీజ కి వివాహం చేసి అల్లుడు కళ్యాణ్ దేవ్ ని సినిమాల్లో కి దించారో ఇప్పుడు రజినీకాంత్ కూడా తన అల్లుడిని సినీ రంగ ప్రవేశం చేయించేలా ప్రయత్నిస్తున్నారు.

ఇటీవలే తన తో సినిమా చేసి పెద్ద హిట్ ఇచ్చిన కార్తీక్ సుబ్బరాజ్ కి ఈ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాల్లో ఉన్నాడట రజినీకాంత్. కార్తీక్ పని తనం మెచ్చిన రజినీకాంత్ ఈ దర్శకుడే అల్లుడి రీ లాంచ్ కి కరెక్ట్ అని భావిస్తున్నాడట.

First Published:  28 April 2019 3:49 AM GMT
Next Story