Telugu Global
Cinema & Entertainment

భన్సాలీ సినిమా కి నో చెప్పిన రష్మిక?

రష్మిక మందన్న తెలుగు లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ హీరోయిన్ చలో సినిమా తో తెరంగేట్రం చేసి, ఆ తర్వాత గీత గోవిందం తో పెద్ద విజయం సాధించింది. చాలా తక్కువ కాలం లో నే పెద్ద విజయాన్ని అందుకొని అందరి మన్ననలు పొందిన హీరోయిన్ రష్మిక. ఇలా తెలుగు తో పాటు కన్నడ సినిమా లని కూడా చేస్తూ వచ్చిన రష్మిక కి అనుకోకుండా బాలీవుడ్ పిలుపు దక్కింది. అది కూడా సంజయ్ లీలా […]

భన్సాలీ సినిమా కి నో చెప్పిన రష్మిక?
X

రష్మిక మందన్న తెలుగు లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ హీరోయిన్ చలో సినిమా తో తెరంగేట్రం చేసి, ఆ తర్వాత గీత గోవిందం తో పెద్ద విజయం సాధించింది. చాలా తక్కువ కాలం లో నే పెద్ద విజయాన్ని అందుకొని అందరి మన్ననలు పొందిన హీరోయిన్ రష్మిక.

ఇలా తెలుగు తో పాటు కన్నడ సినిమా లని కూడా చేస్తూ వచ్చిన రష్మిక కి అనుకోకుండా బాలీవుడ్ పిలుపు దక్కింది. అది కూడా సంజయ్ లీలా భన్సాలీ వంటి పెద్ద దర్శకుడి తదుపరి చిత్రం లో హీరోయిన్ పాత్ర. సాధారణం గా ఎవరైనా ఎగిరి గంతేస్తారు. రష్మిక కూడా అదే చేసింది. కానీ వెంటనే చేయలేను అని చెప్పేసింది.

భన్సాలీ సినిమా ఆఫర్ రావడం తో ఎగిరి గంతేసిన రష్మిక, వెంటనే తన డేట్స్ ఖాళీ లేవని ఆ సినిమా ని రిజెక్ట్ కూడా చేసింది. ఒకేసారి సంతోషం, బాధ రెండూ అనుభవిస్తున్న రష్మిక ఈ విషయాన్ని మర్చిపోయి వెంటనే మళ్ళీ పని ధ్యాస లో పడిపోవాలని చూస్తుంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ సినిమాలో హీరోయిన్ గా చేసిన రష్మిక, తర్వాత నితిన్ తో ఒక సినిమా చేయనుంది.

First Published:  28 April 2019 1:41 AM GMT
Next Story