Telugu Global
NEWS

ఐపీఎల్ లో మహిళా టీ-20 హంగామా

మే 6 నుంచి జైపూర్ వేదికగా మూడుస్తంభాలాట  సూపర్ నోవాస్, ట్రెయిల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్ల సమరం ఐదు దేశాలకు చెందిన 12 మంది విదేశీ క్రికెటర్లు  2018 నుంచి ఐపీఎల్ మహిళా ఎగ్జిబిషన్ మ్యాచ్ లు  తొలిసీజన్లో రెండుజట్లతోనే షో భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఐపీఎల్ లో భాగంగా…. మహిళా టీ-20 ఎగ్జిబిషన్ మ్యాచ్ ల కోసం…బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా మే 6 నుంచి […]

ఐపీఎల్ లో మహిళా టీ-20 హంగామా
X
  • మే 6 నుంచి జైపూర్ వేదికగా మూడుస్తంభాలాట
  • సూపర్ నోవాస్, ట్రెయిల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్ల సమరం
  • ఐదు దేశాలకు చెందిన 12 మంది విదేశీ క్రికెటర్లు
  • 2018 నుంచి ఐపీఎల్ మహిళా ఎగ్జిబిషన్ మ్యాచ్ లు
  • తొలిసీజన్లో రెండుజట్లతోనే షో

భారత క్రికెట్ అభిమానుల వేసవి వినోదం ఐపీఎల్ లో భాగంగా…. మహిళా టీ-20 ఎగ్జిబిషన్ మ్యాచ్ ల కోసం…బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా మే 6 నుంచి 11 వరకూ..మూడు జట్లు, నాలుగు మ్యాచ్ ల సిరీస్ నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను…ఐపీఎల్ 12వ సీజన్ డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ లు ఓ వైపు అలరిస్తుంటే….మరోవైపు…ఐపీఎల్ లో భాగంగా మహిళా టీ-20 ఎగ్జిబిషన్ మ్యాచ్ లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

2018 సీజన్లో తొలిసారిగా ట్రెయిల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ జట్లతో ప్రయోగాత్మకంగా ఎగ్జిబిషన్ మ్యాచ్ లు నిర్వహించారు. అయితే ..అంతంత మాత్రంగానే ఆదరణ లభించినా… ప్రస్తుత 2019 సీజన్లో సైతం కొనసాగించాలని బీసీసీఐ పాలకమండలి సభ్యురాలు డయానా ఎడుల్జీ నిర్ణయించారు.

మూడు స్తంభాలాట!….

ఐపీఎల్ మహిళా టీ-20 తొలిసీజన్లో ట్రెయిల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్ జట్లు తలపడితే…ప్రస్తుత రెండోసీజన్లో మాత్రం వెలాసిటీ జట్టును అదనంగా చేర్చారు. మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంథానా లాంటి అంతర్జాతీయ ప్లేయర్లతో పాటు…భారత దేశవాళీ క్రికెటర్లతో కూడిన జట్లను ఖరారు చేశారు.

అంతేకాదు..మొత్తం ఐదు దేశాలకు చెందిన 12 మంది సభ్యుల ప్రముఖ క్రికెటర్లను సైతం..మూడుజట్లలో సభ్యులుగా చేర్చారు. ఒక్కో జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లతో జట్లు సమతూకంతో ఉండే విధంగా సిద్ధం చేశారు.

మూడుజట్లు…నాలుగు మ్యాచ్ లు

జైపూర్ హవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా మే 6న జరిగే ప్రారంభమ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని సూపర్ నోవాస్ తో స్మృతి మంథానా కెప్టెన్సీలోని ట్రెయిల్ బ్లేజర్స్ జట్టు తలపడనుంది.

మే 8న జరిగే రెండోమ్యాచ్ లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని వెలాసిటీ జట్టుతో…ట్రెయిల్ బ్లేజర్స అమీతుమీ తేల్చుకోనుంది.
మే 9న జరిగే మూడో మ్యాచ్ లో సూపర్ నోవాస్ తో వెలాసిటీ జట్టు ఢీ కొంటుంది. ఈ మూడుమ్యాచ్ ల్లో అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి రెండుజట్లూ…మే 11న జరిగే టైటిల్ సమరంలో ఢీ కొంటాయి.

ఈమ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారం కోసం అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ నెట్ వర్క్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయితే ధూమ్ ధామ్ గా సాగే పురుషుల టీ-20 క్రికెట్ ను చూసిన కళ్లతో… స్లో మోషన్ లా సాగే మహిళా టీ-20 మ్యాచ్ లను ఎంత వరకూ ఆదరిస్తారన్నది అనుమానమే!

సూపర్ నోవాస్ :

హర్మన్ ప్రీత్ కౌర్( కెప్టెన్ ), అనూజా పాటిల్, అరుంధతి రెడ్డి, చమారీ అట్టపట్టు, జెమీమా రోడ్రిగేస్, లియా తహుహు, మానసీ జోషీ, నటాలీ స్కీవియర్, పూనం యాదవ్, ప్రియా పూనియా, రాధా యాదవ్, సోఫీ డివైన్, తాన్యా భాటియా.

ట్రెయిల్ బ్లేజర్స్ :

స్మృతి మంథానా ( కెప్టెన్ ), భారతీ పూల్ మాలీ, డైలాన్ హేమలత, దీప్తి శర్మ, హర్లీన్ డియోల్, జాసియా అక్తర్, జులన్ గోస్వామి, ఆర్.కల్పన, రాజేశ్వరీ గయక్వాడ్, షకీరా సెల్మాన్, సోఫీ ఈకెల్ స్టీన్, స్టెఫానీ టేలర్, సుజీ బేట్స్.

వెలాసిటీ :

మిథాలీ రాజ్ ( కెప్టెన్ ), ఎమీలియా కెర్, డేనియెల్లీ వెయిట్, దేవికా వైద్య, ఏక్తా బిస్త్, హేలీ మాథ్యూస్, జహనారా అలం, కోమల్ జాన్ జాద్, షెఫాలీ వర్మ, శిఖా పాండే, సుష్మ వర్మ, సుష్రీ దివ్యదర్శిని, వేదా కృష్ణ మూర్తి.

First Published:  27 April 2019 8:45 PM GMT
Next Story