Telugu Global
Cinema & Entertainment

తెలుగుతెరపై ఎవెంజర్స్ సత్తా

సీత సినిమాను వాయిదావేసి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మంచి పని చేశాడు. అర్జున్ సురవరం సినిమాను పోస్ట్ పోన్ చేసి నిఖిల్ కూడా చాలా జాగ్రత్తపడ్డాడు. వీళ్లిద్దరూ తమ సినిమాల్ని వాయిదా వేసుకోవడానికి కారణం ఎవెంజర్స్ – ఎండ్ గేమ్ అనే ఇంగ్లిష్ సినిమా. వాళ్ల భయమే నిజమైంది. ఎవెంజర్స్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. నిజంగా ఈ ఊపులో సీత, అర్జున్ సురవరం సినిమాలు వచ్చి ఉంటే ఎవెంజర్స్ బలం ముందు కొట్టుకుపోయేవి. ఎవెంజర్స్ తో పాటు […]

తెలుగుతెరపై ఎవెంజర్స్ సత్తా
X

సీత సినిమాను వాయిదావేసి బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మంచి పని చేశాడు. అర్జున్ సురవరం సినిమాను పోస్ట్ పోన్ చేసి నిఖిల్ కూడా చాలా జాగ్రత్తపడ్డాడు. వీళ్లిద్దరూ తమ సినిమాల్ని వాయిదా వేసుకోవడానికి కారణం ఎవెంజర్స్ – ఎండ్ గేమ్ అనే ఇంగ్లిష్ సినిమా. వాళ్ల భయమే నిజమైంది. ఎవెంజర్స్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. నిజంగా ఈ ఊపులో సీత, అర్జున్ సురవరం సినిమాలు వచ్చి ఉంటే ఎవెంజర్స్ బలం ముందు కొట్టుకుపోయేవి. ఎవెంజర్స్ తో పాటు వచ్చిన మిగతా తెలుగు సినిమాలన్నీ ఇప్పటికే దుకాణం సర్దేశాయి.

విడుదలైన ఈ 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకు అక్షరాలా 8400 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. యూఎస్ బాక్సాఫీస్ లో ఈ సినిమాకు అచ్చంగా 350 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. గత చిత్రం ఎవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కంటే ఈ 4 రోజుల వసూళ్లలో 93 మిలియన్ డాలర్లు ఎక్కువగా కలెక్ట్ చేసింది ఎఁడ్ గేమ్.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ వెర్షన్లు కలిపి 3 రోజుల్లో 18 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయింది. రానా డబ్బింగ్ చెప్పడం, డైలాగ్స్ లో నేటివిటీని తీసుకురావడంతో తెలుగు ప్రేక్షకులకు ఎవెంజర్స్ ఎండ్ గేమ్ బాగా నచ్చింది. ఏపీ, నైజాంలో మహర్షి విడుదలయ్యేంత వరకు ఈ సినిమా హవా కొనసాగే అవకాశం ఉంది.

First Published:  29 April 2019 5:17 AM GMT
Next Story