Telugu Global
NEWS

భారీగా పెరగనున్న ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు..?

ఏపీ ప్రజలకు ఆర్టీసీ షాకివ్వబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది..! ఏపీఎస్ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచాలని యాజమాన్యం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా డీజిల్ ధరలు పెరగడంతో పాటు విడి భాగాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో బస్సుల నిర్వహణ వ్యయం పెరిగి సంస్థపై భారం పడుతోంది. కొన్ని నెలల క్రితమే చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని భయపడి వెనక్కు తగ్గింది. కాగా, గత కొన్ని […]

భారీగా పెరగనున్న ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు..?
X

ఏపీ ప్రజలకు ఆర్టీసీ షాకివ్వబోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది..! ఏపీఎస్ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచాలని యాజమాన్యం నిర్ణయించింది. గత కొన్ని రోజులుగా డీజిల్ ధరలు పెరగడంతో పాటు విడి భాగాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో బస్సుల నిర్వహణ వ్యయం పెరిగి సంస్థపై భారం పడుతోంది.

కొన్ని నెలల క్రితమే చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా ఎన్నికల నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందేమోనని భయపడి వెనక్కు తగ్గింది. కాగా, గత కొన్ని రోజులుగా వ్యయానికి, ఆదాయానికి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో చార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.

దీంతో సంస్థ ఆదాయ పెంపులో భాగంగా 15 నుంచి 17 శాతం చార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఒక వేళ ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే వెంటనే అమలులోనికి వచ్చే అవకాశం ఉంది.

కనీసం 15 శాతం పెంచినా ఏపీ ప్రజలపై చార్జీల భారం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ చార్జీల కంటే ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ఏపీ, టీఎస్ మధ్య తిరిగే బస్సుల్లో తెలంగాణ బస్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.

ఇప్పుడు మరో సారి ఏపీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచితే ఈ వ్యత్యాసం మరింతగా పెరిగి.. అంతర్‌ రాష్ట సర్వీసుల్లో తెలంగాణ బస్సులకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

First Published:  29 April 2019 2:28 AM GMT
Next Story