బెల్లం తినండి… ఆరోగ్యం మీదేనండి…

బెల్లం. పూర్వం ఎక్కువగా వినియోగించే వారు. అందుకే ఆ కాలంలో షుగర్ వంటి వ్యాధులు దరి చేరేవి కావు. ప్రస్తుతం పంచదార వాడకం ఎక్కువైంది. రోగాలూ ఎక్కువయ్యాయి.

బెల్లంలో ఉన్న ఔషధ గుణాలు పంచదారలో లేకపోవడమే కాదు చెడు గుణాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకే పంచదారను తెల్ల దెయ్యం అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

పంచదారలో ఎన్ని దుష్ప్రయోజనాలు ఉన్నాయో… బెల్లంలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం రెండు రంగుల్లో దొరుకుతుంది. వీటిలో కొద్దిగా రంగు తక్కువగా ఉండే బెల్లం మిగిలిన వాటికంటే మంచిది. తెల్ల బెల్లం అంత శ్రేష్టం కాదని ఆయర్వేదం చెబుతోంది. ఆయుర్వేద వైద్యంలో బెల్లం ఎక్కువగా వాడతారు. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు… వాటి వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెల్సుకుందాం.

  • ప్రతీ రోజూ బెల్లాన్ని మీ ఆహారంలో ఏదో రూపంలో తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
  • ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
  • శరీరంలో మలినాలను తొలగించి వ్యర్దాలను బయటకి పంపటానికి తోడ్పడుతుంది.
  • మధుమేహ సమస్య ఉన్న వారు బెల్లంతో చేసిన స్వీట్స్ లేక ఇతర ఆహారం కొద్దిగా తినవచ్చు. 
  • లో-షుగర్ తో బాధపడుతున్న వారు చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే… వెంటనే వారి ఎనర్జీ లెవెల్స్ పెరిగి షుగర్ నార్మల్ కి వస్తుంది.
  • ఎనీమియాతో బాధపడుతున్న వారు బెల్లంతో చేసిన ఆహారం లేదా ప్రతిరోజూ చిన్న బెల్లం ముక్క తింటే ఆ సమస్య నుంచి బయటపడతారు.
  • బెల్లం శరీరంలో ఉన్న ఎర్ర రక్త కణాల స్దాయిని కాపాడుతుంది.
  • బెల్లంలో రక్తపోటును నివారించే పొటాషియం, సోడియం వంటి ఖనిజాలు ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటే గుండె సమస్యలు రావని వైద్య నిపుణులు అంటున్నారు.
  • ఆరోగ్యవంతమైన కాలేయం కోసం… బెల్లం ఎక్కువ తీసుకుంటే లివర్ సమస్యలు దూరమవుతాయి. బెల్లంలో కాలేయాన్ని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి.
  • కొంతమందికి కాళ్లు.. చేతులు తరచు కొంకర్లు తిరుగుతుంటాయి. అలాంటి వారు ప్రతిరోజూ పంచదారకి బదులు బెల్లం తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడతారు.
  • బెల్లం శరీరంలో బౌల్ మూమెంట్ ను యాక్టివ్ చేస్తుంది. దీని వల్ల శరీరంలో ఉన్న వ్యర్దాలు బయటకి పోతాయి. మలబద్దక సమస్య నుంచి బయటపడవచ్చు.
  • స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడే వారు బెల్లంతో చేసే స్వీట్స్ తింటే కొలెస్ట్ర్రాల్, ఊబకాయ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • స్త్రీలకు నెలసరిలో వచ్చే నొప్పి.. ఇతర రుతు సమస్యలకు బెల్లం దివ్యౌషధం.
  • రోజు పెరుగు అన్నం తిన్న తర్వాత చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని చప్పరిస్తే రక్తం శుద్ది అవ్వడమే కాక జీర్ణ శక్తిని పెంచుతుంది.
  • బెల్లంలో రక్తన్ని శుద్ది చేసే గుణాలు అధికంగా ఉన్నాయి.
  • మైగ్రేన్ కు బెల్లం చాలా మంచి మందని ఆయర్వేదం చెబుతోంది.
  • ప్రతిరోజూ బెల్లం తింటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి… దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు దరి చేరవని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.