Telugu Global
Cinema & Entertainment

వాళ్లిద్దర్నీ కైరా అద్వానీ ఆదుకుంటుందా?

సాధారణంగా హీరోయిన్లను హీరోలు ఆదుకుంటారు. సదరు హీరో హిట్ కొడితే హీరోయిన్ పంట పండినట్టే. హిట్ హీరోయిన్ అనిపించుకుంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్. హీరోయిన్ హిట్ కొట్టాలని ఇద్దరు దర్శకులు కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? కైరా అద్వానీ. అర్జున్ రెడ్డి రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీని తీసుకున్నారు. సినిమాలో హీరోయిన్ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే […]

వాళ్లిద్దర్నీ కైరా అద్వానీ ఆదుకుంటుందా?
X

సాధారణంగా హీరోయిన్లను హీరోలు ఆదుకుంటారు. సదరు హీరో హిట్ కొడితే హీరోయిన్ పంట పండినట్టే. హిట్ హీరోయిన్ అనిపించుకుంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్. హీరోయిన్ హిట్ కొట్టాలని ఇద్దరు దర్శకులు కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? కైరా అద్వానీ.

అర్జున్ రెడ్డి రీమేక్ తో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వానీని తీసుకున్నారు. సినిమాలో హీరోయిన్ ఎంత కీలకమో అందరికీ తెలిసిందే కదా. అందుకే కైరాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు సందీప్. ఇప్పటికే షాహిద్ లుక్ హిట్ అవ్వడంతో సందీప్ హ్యాపీగా ఉన్నాడు. కైరా లుక్ కూడా క్లిక్ అయితే సక్సెస్ అయినట్టే.

ఇలా కైరాపై నమ్మకం పెట్టుకున్న మరో దర్శకుడు లారెన్స్. సందీప్ రెడ్డి లాగానే లారెన్స్ కూడా బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. తన హిట్ మూవీ కాంచనను హిందీలో రీమేక్ చేస్తున్నాడు లారెన్స్. ఇందులో కైరా అద్వానీని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఇలా తన సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు సౌత్ దర్శకుల్ని బాలీవుడ్ కు పరిచయం చేస్తోంది కైరా.

First Published:  29 April 2019 5:27 AM GMT
Next Story