Telugu Global
Cinema & Entertainment

మహర్షి కథ ఇదేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రం ‘మహర్షి’ మే 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ కి 25వ సినిమా కావడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కథ గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ […]

మహర్షి కథ ఇదేనా?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 25 వ చిత్రం ‘మహర్షి’ మే 9న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

అల్లరి నరేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. మహేష్ కి 25వ సినిమా కావడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమా కథ గురించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సినిమా కథ ఇలా ఉండబోతోంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. మహర్షి సినిమాలో మహేష్ బాబు మూడు విభిన్న అవతారాల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు మొదట అమెరికా లో ఉంటున్న ఒక పెద్ద బిజినెస్ మాన్ లా కనిపిస్తాడట. ఆ తరువాత స్నేహితుడు (అల్లరి నరేష్) కోసం తన గ్రామానికి వచ్చి అక్కడ రైతు కష్టాలు చూసి చలించిపోయిన మహేష్ ఆధునిక వ్యవసాయం తో వారికి సహాయం చేస్తాడట.

ఈ సినిమాలో ఒక భాగంలో మహేష్ బాబు ఒక విద్యార్థిగా కూడా కనిపించబోతున్నాడు. ‘మహర్షి’ సినిమా కథ ఇదే అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

ఇందులో నిజానిజాలు తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

First Published:  29 April 2019 11:10 AM GMT
Next Story