ఒక్క ట్వీట్ చేశాడు, లక్షలు తీసుకున్నాడు….

సూపర్ స్టార్ మహేష్ బాబు సాధారణమైన నటుడు కాదు. తనని తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఎలాంటి సినిమాలు చేయాలి, ఆ సినిమాలని జనాలకి ఎలా రీచ్ చేయాలి అన్న విషయాల పైన అత్యంత క్లారిటీ ఉన్న నటుడు.

ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమ లో నంబర్ వన్ స్థానం లో దూసుకు పోతున్న అగ్ర నటుడు మహేష్ బాబు. ప్రస్తుతం తన 25 వ సినిమా మహర్షి రిలీజ్ కార్యక్రమాల్లో బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈయన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా సొమ్ము చేసుకునే కొత్త అవతారం ఎత్తాడు. సాధారణం గా తాను ఎండార్స్ చేసే బ్రాన్డ్స్ పైన కూడా పెద్దగా పోస్టులు పెట్టని మహేష్ ఇప్పుడు ఏకంగా మార్కెట్ లో కి లాంచ్ అయిన కొత్త మ్యూజిక్ యాప్ “స్పాటిఫై” గురించి ట్వీట్ చేసాడు.

ఇతర దేశాల్లో ఎంతగానో ప్రాముఖ్యం పొందిన ఈ ఆడియో స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు భారత దేశంలో కూడా లాంచ్ చేయబడింది. అయితే గమనించాల్సిన విషయం ఏంటి అంటే మహేష్ వేసిన సింగల్ ట్వీట్ కి దాదాపు గా లక్షల్లో పారితోషికం అందుకున్నాడట. ఒక్క ట్వీట్ ఖరీదు లక్షల్లో ఉంది అంటే, కంపెనీ వాళ్లకి దాని ప్రతిఫలం కూడా డబుల్ ఉంటుంది అని అంచనా.