దిల్ రాజు సినిమాలో నాని లేడు

నన్ను దోచుకుందువటే సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేసిన నటుడు సుధీర్ బాబు, ఆ సినిమా పెద్దగా ఆడక పోవడం తో నిరాశ చెందాడు. తదుపరి చిత్రం ఏది అయితే బాగుంటుంది అనే ఆలోచనలు చేసిన తర్వాత చివరికి ఒక క్లారిటీ కి వచ్చాడు. సమ్మోహనం వంటి విజయాన్ని అందించిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో మళ్ళీ ఇంకో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు.

అయితే అన్నిటి కంటే పెద్ద షాక్ ఏంటి అంటే, ఈ సినిమా లో కేవలం సుధీర్ బాబు మాత్రమే హీరో. మీడియా కథనాల ప్రకారం నాని కూడా ఈ సినిమా లో ఉన్నాడు అనే వార్తలు మనం చూశాము…. కానీ నేడు నిర్మాతలు ఇచ్చిన అధికారిక ప్రకటన లో నాని ఈ సినిమాలో లేడు అని తేలిపోయింది.

సుధీర్ బాబు ఈ సినిమా లో సోలో హీరో కాగా నివేతా థామస్ మరియు అదితి రావ్ హైదరి ఈ చిత్రం లో నాయికలు గా నటించనున్నారు. ఈ సినిమాకి ‘వీ’ అనే అక్షరాన్ని టైటిల్ గా ఖరారు చేయడం జరిగింది.

దిల్ రాజు ఈ సినిమా కి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమా కి స్వరాలు సమకూర్చనున్నారు.