నివేతా పెతురాజ్ కి…. ‘సాహో’ నటుడి అవకాశం!

తమిళ చిత్ర పరిశ్రమ లో ‘ఓరు నాళ్ కుతుం’ అనే చిత్రం తో తెరంగేట్రం చేసిన నటి నివేతా పెతురాజ్ ఆ తర్వాత తెలుగు లో ‘మెంటల్ మందిలో’ అనే చిత్రం తో తెలుగుతెరకు పరిచయం అయింది.

ఇటీవలే చిత్రలహరి సినిమా లో సాయి ధరమ్ తేజ్ సరసన రెండో హీరోయిన్ గా నటించిన ఈ భామ ఇప్పుడు సాహో నటుడు అరుణ్ విజయ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

తాజా ఫిలిం నగర్ వర్గాల సమాచారం మేరకు సాహో పూర్తి చేసుకున్న అరుణ్ విజయ్ తన తదుపరి తమిళ చిత్ర పనుల్లో బిజీ అయ్యాడు.

D16 పేరు తో వచ్చిన సినిమా ని తీసిన కార్తీక్ నరేన్ అరుణ్ విజయ్ కొత్త చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా కోసం దర్శకుడు నివేతా ని నాయిక గా ఖరారు చేయనున్నారట. అయితే కార్తిక్ తన రెండో చిత్రాన్ని సందీప్ కిషన్ తో చేశాడు…. కానీ ఆ సినిమా ఇంకా విడుదల కి నోచుకోలేదు. ఈ అరుణ్ విజయ్ కొత్త చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా కి నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. నివేతా త్వరలో తెలుగు లో ‘బ్రోచేవారెవరు రా’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.