సాహో సాంగ్.. మరోసారి యూరోప్ టూర్

సాహో సినిమాకు సంబంధించి కనీసం 5 సార్లు యూరోప్ షెడ్యూల్ ఉంటుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. కానీ బడ్జెట్ హద్దులు దాటిపోతుందనే ఉద్దేశంతో 3 షెడ్యూల్స్ క్యాన్సిల్ చేశారు. అచ్చంగా యూరోప్ లోని నగరాల్ని తలపించే సెట్ ను రామోజీ ఫిలింసిటీలో వేసి షూటింగ్ పూర్తిచేశారు. అయితే ఈసారి మాత్రం కచ్చితంగా యూరోప్ వెళ్లాల్సిన అవసరం వచ్చింది.

సాహో సినిమాకు సంబంధించి త్వరలోనే ఓ పాట షూటింగ్ కోసం యూరోప్ వెళ్లబోతున్నారంతా. కేవలం 4 రోజుల పాటు ఉండే ఈ షెడ్యూల్ లో ప్రభాస్, శ్రద్ధాకపూర్ పై ఓ రొమాంటిక్ సాంగ్ తీయబోతున్నారు. ఈ షెడ్యూల్ తో సాహో షూటింగ్ దాదాపు పూర్తయిపోతుందట.

సినిమాకు సంబంధించి ప్రస్తుతం ముంబయి షెడ్యూల్ నడుస్తోంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో సినిమాకు సంబంధించి ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత యూరోప్ షెడ్యూల్ ఉంటుంది. ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ విడుదల కానుంది సాహో సినిమా