Telugu Global
Cinema & Entertainment

'అడవి రాముడు' తో 'ఆర్ ఆర్ ఆర్' కి పోలికేంటి ?

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పైన భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ రామ్ చరణ్ సరసన నటించబోతోంది. ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరిగా నిత్యా మీనన్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. […]

అడవి రాముడు తో ఆర్ ఆర్ ఆర్ కి పోలికేంటి ?
X

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పైన భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ రామ్ చరణ్ సరసన నటించబోతోంది. ఎన్టీఆర్ సరసన నటించేందుకు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరిగా నిత్యా మీనన్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అభిమానులు ఒక ఆసక్తికరమైన విషయాన్ని చర్చిస్తున్నారు. ‘అడవి రాముడు’ సినిమా లో సీనియర్ ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ఒకరు సిటీ అమ్మాయిగా జయప్రద, మరొకరు పల్లెటూరి అమ్మాయి గా జయసుధ.

అలాగే ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. అందులో నిత్యామీనన్ పల్లెటూరి పిల్లగా మరొక హీరోయిన్ కోసం ఒక ఫారిన్ అమ్మాయిని వెతికే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

ఇలా ఈ రెండు సినిమాలలో కామన్ పాయింట్ ని బయటకి లాగారు నందమూరి అభిమానులు. ఇక డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా జులై లో విడుదల కానుంది.

First Published:  30 April 2019 1:42 AM GMT
Next Story