Telugu Global
Cinema & Entertainment

మహేష్ సినిమాలో రకుల్.... కానీ!

మహేష్-రకుల్ కాంబినేషన్ ఆడియన్స్ కు కొత్తకాదు. వీళ్లిద్దరూ కలిసి స్పైడర్ సినిమా చేశారు. ఆ సినిమా దెబ్బకు రకుల్ తెరమరుగైంది. ఆమెకు తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. స్పైడర్ టైమ్ లోనే రకుల్ తో మహేష్ మరో సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ పుకార్లు వచ్చాయి. అవి ఇప్పటికి నిజమైనట్టు కనిపిస్తున్నాయి. తన అప్ కమింగ్ మూవీలో రకుల్ కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట మహేష్. త్వరలోనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు […]

మహేష్ సినిమాలో రకుల్.... కానీ!
X

మహేష్-రకుల్ కాంబినేషన్ ఆడియన్స్ కు కొత్తకాదు. వీళ్లిద్దరూ కలిసి స్పైడర్ సినిమా చేశారు. ఆ సినిమా దెబ్బకు రకుల్ తెరమరుగైంది. ఆమెకు తెలుగులో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. స్పైడర్ టైమ్ లోనే రకుల్ తో మహేష్ మరో సినిమా చేసే ఛాన్స్ ఉందంటూ పుకార్లు వచ్చాయి. అవి ఇప్పటికి నిజమైనట్టు కనిపిస్తున్నాయి. తన అప్ కమింగ్ మూవీలో రకుల్ కు ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట మహేష్.

త్వరలోనే అనీల్ రావిపూడి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు మహేష్. ఈ సినిమాలో రకుల్ ను తీసుకునే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇందులో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా రకుల్ ను తీసుకోవడం లేదు. ఓ కీలక పాత్ర కోసం రకుల్ పేరును పరిశీలిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా రష్మికను తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

ఈ సినిమాలో ఇప్పటికే విజయశాంతి, బండ్ల గణేశ్, రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ ఆర్టిస్టుల్ని తీసుకున్నారు. రకుల్ రాకతో ప్రాజెక్టుకు మరింత వెయిట్ పెరిగినట్టయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నాగ్ సరసన మన్మధుడు-2 సినిమా చేస్తోంది. మహేష్-అనిల్ రావిపూడి సినిమాలో రకుల్ ఉంటుందా ఉండదా అనే విషయం మే నెలాఖరుకు తెలిసిపోతుంది.

First Published:  30 April 2019 5:01 AM GMT
Next Story