Telugu Global
Cinema & Entertainment

మళ్లీ ఇంకో తేదీ.. ఈసారైనా వస్తుందా?

అర్జున్ సురవరం వాయిదాల పర్వం గురించి చెప్పుకుంటూ పోతే ఏకంగా ఓ పుస్తకం రాయొచ్చు. అన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది ఈ సినిమా. అంతెందుకు, లెక్కప్రకారం ఈరోజు ఈపాటికి ఈ సినిమా థియేటర్లలో ఉండాలి. కానీ వాయిదా పడింది. అలా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమాకు తాజాగా మరో డేట్ ఫిక్స్ చేశారు. ఈసారి మే 17ను లాక్ చేశారు. మొన్నటివరకు గ్రాఫిక్ వర్క్ కారణంగా సినిమా వాయిదాపడింది. ఆ తర్వాత రీషూట్స్ వల్ల […]

మళ్లీ ఇంకో తేదీ.. ఈసారైనా వస్తుందా?
X

అర్జున్ సురవరం వాయిదాల పర్వం గురించి చెప్పుకుంటూ పోతే ఏకంగా ఓ పుస్తకం రాయొచ్చు. అన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది ఈ సినిమా. అంతెందుకు, లెక్కప్రకారం ఈరోజు ఈపాటికి ఈ సినిమా థియేటర్లలో ఉండాలి. కానీ వాయిదా పడింది. అలా వాయిదాల మీద వాయిదాలు పడుతున్న ఈ సినిమాకు తాజాగా మరో డేట్ ఫిక్స్ చేశారు. ఈసారి మే 17ను లాక్ చేశారు.

మొన్నటివరకు గ్రాఫిక్ వర్క్ కారణంగా సినిమా వాయిదాపడింది. ఆ తర్వాత రీషూట్స్ వల్ల మరోసారి వాయిదాపడింది. ఆ తర్వాత జెర్సీ వల్ల ఇంకోసారి, తాజాగా ఎవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ వల్ల మరోసారి ఈ సినిమా వాయిదాలు పడుతూ వస్తోంది. మహర్షి ముందు రిలీజ్ చేస్తే రిస్క్ చేసినట్టు అవుతుందని, మహర్షి విడుదలకు 9 రోజులు గ్యాప్ ఇచ్చి అర్జున్ సురవరాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

ప్రస్తుతానికైతే డేట్ లాక్ చేశారు. కానీ చెప్పిన తేదీకి ఇది వస్తుందా రాదా అనేది మహర్షి రిజల్ట్ పైన ఆధారపడి ఉంటుంది. మహేష్ కెరీర్ లో 25వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం అంత తొందరగా మహర్షిపై అర్జున్ సురవరాన్ని దించే సాహసం చేయరు. సో… అప్పుడు మరోసారి సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం.

First Published:  1 May 2019 7:00 AM GMT
Next Story