ఫొని ఎఫెక్ట్ : బంగాళాఖాతం అల్లకల్లోలం…. 74 రైళ్లు రద్దు

హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మధ్య ఏర్పడిన ఫొని తుఫాను తీవ్రమైన సైక్లోన్‌గా మారింది. ఇది ఆంధ్రా తీరం వైపు వస్తుందనే కథనాల నేపథ్యంలో ప్రభుత్వం శాఖలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రేపు, ఎల్లుండి ప్రచంఢమైన గాలులతో పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.

భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ ముందస్తుగా 74 రైళ్లను రద్దు చేసింది. మే 2న సాయంత్రం నుంచి భద్రక్ – విజయనగరం మధ్య నడిచే రైలుతో పాటు ఈస్ట్ కోస్ట్, కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది.

మరోవైపు హౌరా నుంచి బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లను కూడా రద్దు చేశారు. తుఫాను తీవ్రంగా ఉన్న దృష్ట్యా కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ముఖ్యంగా భువనేశ్వర్, పూరీ వైపు వెళ్లే రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. ముందు జాగ్రత్తగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు.