Telugu Global
Cinema & Entertainment

నాని హ్యాండ్ ఇచ్చాడు.... తేజూ ఒప్పుకున్నాడు

దర్శకుడు మారుతికి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. రీసెంట్ గా అతడు తీసిన శైలజారెడ్డి అల్లుడు అతడి దర్శకత్వంపై విమర్శలు వచ్చేలా చేసింది. పైగా సినిమా కూడా పెద్ద హిట్ కాదు. అంతకంటే ముందు మారుతి సమర్పించిన కొన్ని సినిమాలు అతడి ఇమేజ్ ను బాగా దెబ్బతీశాయి. దీంతో కెరీర్ లో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు, మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఓ మంచి కుటుంబ కథను సిద్ధం చేసుకున్నాడు మారుతి. […]

నాని హ్యాండ్ ఇచ్చాడు.... తేజూ ఒప్పుకున్నాడు
X

దర్శకుడు మారుతికి అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. రీసెంట్ గా అతడు తీసిన శైలజారెడ్డి అల్లుడు అతడి దర్శకత్వంపై విమర్శలు వచ్చేలా చేసింది. పైగా సినిమా కూడా పెద్ద హిట్ కాదు. అంతకంటే ముందు మారుతి సమర్పించిన కొన్ని సినిమాలు అతడి ఇమేజ్ ను బాగా దెబ్బతీశాయి. దీంతో కెరీర్ లో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు, మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు.

ఓ మంచి కుటుంబ కథను సిద్ధం చేసుకున్నాడు మారుతి. తనకు కలిసొచ్చిన నానితో ఆ సినిమాను తీయాలనేది అతడి ప్లాన్. నానితో కథాచర్చలు కూడా సాగాయి. జెర్సీ తర్వాత ఆ సినిమానే చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ నాని మాత్రం ఈసారి మారుతికి హ్యాండ్ ఇచ్చాడు. అతడ్ని కాదని ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

దీంతో సాయి తేజ్ ను ఆశ్రయించాడు మారుతి. చిత్రలహరి సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్, మారుతి లాంటి దర్శకుడు అడగడంతో కాదనలేకపోయాడు. వెంటనే ఓకే చెప్పాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. అలా నాని కోసం అనుకున్న సినిమా సాయి తేజ్ చెంతకు చేరింది.

First Published:  1 May 2019 5:28 AM GMT
Next Story