Telugu Global
NEWS

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి మృతి

హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి (76) బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలీలో ఉన్న ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, కేరళ, తమిళనాడు హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌గా, ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త తొలి చైర్మన్‌గా పనిచేశారు. జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి 1942 మార్చిలో హైదరాబాద్‌లో జన్మించారు. […]

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి మృతి
X

హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి (76) బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలీలో ఉన్న ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు.

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, కేరళ, తమిళనాడు హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌గా, ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త తొలి చైర్మన్‌గా పనిచేశారు.

జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి 1942 మార్చిలో హైదరాబాద్‌లో జన్మించారు. ఉస్మానియా యూనివర్శిటీలో లా చదివారు. 1966లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. 1991లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆయన కుమారుల్లో ఇద్దరు న్యాయవాద వృత్తిలో ఉంటున్నారు.

ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంతిమ సంస్కారాలు జరుపుతామని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.

First Published:  1 May 2019 4:15 AM GMT
Next Story