ఎన్డీ తివారీ లాగే…. కొడుకుకూ వివాహేతర సంబంధం !

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా, ఏపీ గవర్నర్‌ గా…. కాంగ్రెస్‌లో అత్యున్నత పదవులు అనుభవించిన ఎన్డీ తివారీ తన వివాహేతర సంబంధాల కారణంగా దేశమంతా గబ్బుపట్టాడు.

రోహిత్‌ అనే ఒక యువకుడు తన తండ్రి ఎన్డీ తివారీ అంటూ కోర్టులో కేసు వేశాడు. కోర్టు డీఎన్‌ఏ టెస్టులకు ఆదేశించగా అందుకు ఎన్డీ తివారీ అంగీకరించలేదు. చాలాకాలం న్యాయపోరాటం తరువాత రోహిత్‌ను తన కొడుకుగా అంగీకరించాడు తివారీ.

కొద్దిరోజుల తరువాత తివారీ చనిపోయాడు. ఏడాది క్రితం ఈ రోహిత్ అపూర్వ శుక్లా అనే ఒక లాయర్‌ను పెళ్ళిచేసుకున్నాడు. ఆమెకు రాజకీయాలంటే పిచ్చి. రోహిత్‌ భార్యను అయితే రాజకీయాల్లో దూసుకుపోవచ్చని భ్రమ పడి రోహిత్‌ను పెళ్ళి చేసుకుంది.

అయితే పెళ్ళయ్యాక ఆమెకు అసలు విషయం తెలిసింది. ఎన్డీ తివారీ లాగే వాళ్ళ అబ్బాయి రోహిత్‌ కు ఒక స్త్రీ తో వివాహేతర సంబంధం ఉందని, వాళ్ళకు ఒక అబ్బాయి కూడా పుట్టాడని తెలుసుకుంది.

ఇక దీనిపై ఇంట్లో రచ్చరచ్చ. అలా ఒకరోజు రోహిత్‌ బాగా మధ్యం సేవించి ఉన్నప్పుడు మొదలైన రచ్చ…. రోహిత్‌ మొహం మీద దిండుతో అదిమి ఊపిరి పీల్చుకోకుండా చేసి రోహిత్‌ను చంపేసింది భార్య. లాయర్‌ కాబట్టి సాక్ష్యాధారాలన్నింటినీ మాయం చేసినా పోలీసులు ఆమే హంతకురాలని తేల్చారు. భర్తను ఎందుకు చంపావు అని అడిగితే తనతో పెళ్ళి కాకముందే ఆయనకు మరో స్త్రీకి పుట్టిన పిల్లాడికి ఆస్తి మొత్తం రాసిచ్చే ప్రయత్నంలో రోహిత్‌ ఉన్నాడని తెలిసి భర్తను చంపేశానని చెప్పిందట.

సో…. మొత్తం మీద తండ్రి లాగే కొడుకు కూడా వివాహేతర సంబంధం వల్ల వారసుల్ని కని దెబ్బతిన్నారు.