షాలినీ పాండేకు మరో ఛాన్స్

అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత షాలినీ పాండే జాతకం మారిపోతుందని అంతా ఊహించారు. సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ చూసి ఇక షాలినీకి తిరుగు ఉండదని అంతా భావించారు.

కానీ అనూహ్యంగా ఈ పిల్ల రేసులో వెనకబడింది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ వరుస అవకాశాలతో దూసుకుపోతే, షాలినీ మాత్రం అరకొరగా మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఈ అర్జున్ రెడ్డి పిల్లకు మరో ఛాన్స్ దక్కింది.

రాజ్ తరుణ్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది షాలినీ పాండే. లవర్ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజ్ తరుణ్.. దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు “ఇద్దరి లోకం ఒకటే” అనే టైటిల్ పెట్టారు. కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా షాలినీ పాండేను సెలక్ట్ చేశారు.

మొన్నటివరకూ ఈ సినిమాకు హీరోయిన్ గా మేఘా ఆకాశ్ పేరు వినిపించింది. అయితే మేఘా ఆకాష్ కి బదులు ఇప్పుడు షాలినీ పాండే ను ఫైనలైజ్ చేశారు. రీసెంట్ గా 118 సినిమా చేసింది షాలినీ. అందులో గ్లామరస్ గా బాగానే ఆకట్టుకుంది. రాజ్ తరుణ్ సినిమా కూడా హిట్ అయితే షాలినీకి ఇంకొంచెం అవకాశాలు రావొచ్చు.