Telugu Global
Health & Life Style

పుదీనా.... త్రిదోష సంహారిణి....

చిన్న చిన్న చిట్కాలు జీవన శైలిలో ఎన్నో మార్పులు తెస్తాయి. అటు అందానికి… ఇటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పుదీనా కొంచెం ఘాటైన వాసనే కాదు చక్కటి రుచి కూడా అందిస్తుంది. ఇది త్రిదోషాలను హరిస్తుంది. పుదీనా తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.. పుదీనా ఆకులు లేదా కాడలు దంత సమస్యలకు మంచి ఔషధం. పంటి నొప్పి, దంతక్షయాన్ని ఇవి నివారిస్తాయి. పుదీనా నీటిని లేదా కషాయాన్ని పుక్కిలించి ఉమ్మితే చిగుళ్లు గట్టి […]

పుదీనా.... త్రిదోష సంహారిణి....
X

చిన్న చిన్న చిట్కాలు జీవన శైలిలో ఎన్నో మార్పులు తెస్తాయి. అటు అందానికి… ఇటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. పుదీనా కొంచెం ఘాటైన వాసనే కాదు చక్కటి రుచి కూడా అందిస్తుంది. ఇది త్రిదోషాలను హరిస్తుంది. పుదీనా తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెల్సుకుందాం..

  • పుదీనా ఆకులు లేదా కాడలు దంత సమస్యలకు మంచి ఔషధం. పంటి నొప్పి, దంతక్షయాన్ని ఇవి నివారిస్తాయి.
  • పుదీనా నీటిని లేదా కషాయాన్ని పుక్కిలించి ఉమ్మితే చిగుళ్లు గట్టి పడడమే కాక పిప్పి పళ్ళ నుంచి వచ్చే నొప్పి కూడా తగ్గుతుంది.
  • పుదీనా ఆకులను ముద్దగా చేసి పళ్లను తోమితే తెల్లగా మెరుస్తాయి.
  • అజీర్ణ సమస్యలకు పుదీనా అద్భుతంగా పనిచేస్తుంది.
  • అతి మాంద్యము (dyspepsia), వాంతులు, వికారం, వాతం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగును.
  • ఎసిడిటీ, అతి త్రేన్సులతో బాధపడుతున్న వారు పుదీనా కషాయం తాగినా లేదా పుదీనా ఆకులు నమిలినా మంచి ఫలితం ఉంటుంది.
  • పుదీనా ఆకును పాలలో వేస్తే ఆ పాలు తొందరగా విరిగిపోవు.
  • తల తిరగం, కళ్లు తిరగడం, వికారం వంటి సమస్యలు ఉన్న వారు పుదీనా వాసన చూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  • పుదీనా ఆకుల ఘాటుకు కడుపులో ఉన్న నులిపురుగులు, ఇతర క్రిములు నశిస్తాయి.
  • మలబద్దకానికి పుదీనా చాలా మంచి ఔషధం.
  • కడుపులో ఉన్న మలినాలను, వ్యర్దాలను బయటకి పంపేందుకు పుదీనా దోహదపడుతుంది.
  • చిన్న పిల్లలలో తరచు వచ్చే జలుబు, కఫం సమస్యలకు పుదీనా రసం, కర్పూరం, కొబ్బరి నూనెలో కలిపి ఛాతికి, వెన్నుకి మర్దన చేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
  • గొంతు నొప్పి, గొంతు పూడుకు పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పుదీనాతో చేసిన టీ దివ్యౌషధం.
  • పుదీనాలో ఉన్న ఖనిజాలు, మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేసి గుండె సమస్యలను నివారిస్తాయి.
  • ఇనుమ, విటమిన్ ‘సి’ రోగ నిరోధక శక్తిని పెంచి, రక్తంలో హిమోగ్లోబిన్ ను సమతుల్యంగా ఉంచుతుంది.

పుదీనాలో ఇంకా కాల్షియం, లవణాలు, ఇతర పోషకాలు అనేకం ఉన్నాయి. వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు పుదీనా తినాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. పుదీనా టీ ప్రతిరోజూ తాగితే మరీ మంచిదంటున్నారు.

First Published:  30 April 2019 10:28 PM GMT
Next Story