Telugu Global
International

శ్రీలంకలో పీస్ టీవీ ఛానల్‌పై నిషేధం..!

శ్రీలంకలో జరిగిన నరమేధానికి కారణాలు వెదికే పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ముస్లిం మత ప్రచారాల ఛానెల్ ‘పీస్ టీవీ’ని శ్రీలంక ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు దేశంలోని కేబుల్ ఆపరేటర్లు, డీటీహెచ్ ఆపరేటర్లకు సమాచారం అందించడంతో నేటి నుంచి అక్కడ ప్రసారాలు నిలిచిపోయాయి. ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఈ ఛానెల్లో చేసే బోధనల వల్ల యువత ఐసిస్ తీవ్రవాద భావజాలం వైపు మళ్లుతున్నారని శ్రీలంక ప్రభుత్వం భావించింది. దీంతో […]

శ్రీలంకలో పీస్ టీవీ ఛానల్‌పై నిషేధం..!
X

శ్రీలంకలో జరిగిన నరమేధానికి కారణాలు వెదికే పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన ముస్లిం మత ప్రచారాల ఛానెల్ ‘పీస్ టీవీ’ని శ్రీలంక ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు దేశంలోని కేబుల్ ఆపరేటర్లు, డీటీహెచ్ ఆపరేటర్లకు సమాచారం అందించడంతో నేటి నుంచి అక్కడ ప్రసారాలు నిలిచిపోయాయి.

ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ఈ ఛానెల్లో చేసే బోధనల వల్ల యువత ఐసిస్ తీవ్రవాద భావజాలం వైపు మళ్లుతున్నారని శ్రీలంక ప్రభుత్వం భావించింది. దీంతో పీస్ టీవీ ఛానల్‌ను అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

ముంబైకి చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్, జకీర్ నాయక్ సంయుక్తంగా 2006లో ఈ ఛానెల్ ప్రారంభించారు. ఉర్థూ వెర్షన్ 2009లో, బంగ్లా వెర్షన్ 2011లో ప్రారంభమయ్యింది. ఇప్పటికే ఈ ఛానెల్ ప్రసారాలు భారత్, బంగ్లాదేశ్‌లో నిషేధించారు. జకీర్ నాయక్ కూడా 2016లో భారత్ వదిలి వెళ్లిపోయాడు.

First Published:  1 May 2019 11:21 AM GMT
Next Story