Telugu Global
NEWS

చంద్రబాబు ఫలితాల లోపు ఏం చేయబోతున్నారో తెలుసా?

ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు డమ్మీ అయిపోయారు. ఆయన నామమాత్రపు సీఎం.. అధికారాలు లేవు.. విధులు లేవు.. కేవలం ఆపద్ధర్మ సీఎంగా ఉన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండడం.. ఈసీకి సర్వాధికారాలు చేజిక్కడంతో ఆయన చేతులు కట్టేసినట్టుగా ఉంది. ఎప్పుడూ హంగు ఆర్బాటాలకు పోతూ మీడియాలో తనే హైలైట్ కావాలనే మెంటాల్టీ బాబుది అని ఆయన సన్నిహితులు ఎప్పటి నుంచో వ్యాఖ్యానిస్తున్నారు. ఏదో పనిచేస్తున్నట్టు హడావుడి చేసి ప్రజల్లో నానుతుంటారు. ఒక్కరోజు పేపర్లలో కనిపించకపోతే అల్లాడిపోతాడట.. జనాలు […]

చంద్రబాబు ఫలితాల లోపు ఏం చేయబోతున్నారో తెలుసా?
X

ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు డమ్మీ అయిపోయారు. ఆయన నామమాత్రపు సీఎం.. అధికారాలు లేవు.. విధులు లేవు.. కేవలం ఆపద్ధర్మ సీఎంగా ఉన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండడం.. ఈసీకి సర్వాధికారాలు చేజిక్కడంతో ఆయన చేతులు కట్టేసినట్టుగా ఉంది.

ఎప్పుడూ హంగు ఆర్బాటాలకు పోతూ మీడియాలో తనే హైలైట్ కావాలనే మెంటాల్టీ బాబుది అని ఆయన సన్నిహితులు ఎప్పటి నుంచో వ్యాఖ్యానిస్తున్నారు. ఏదో పనిచేస్తున్నట్టు హడావుడి చేసి ప్రజల్లో నానుతుంటారు. ఒక్కరోజు పేపర్లలో కనిపించకపోతే అల్లాడిపోతాడట.. జనాలు తనను మరిచిపోతారని కంగారు పడుతారట.. అందుకే బాబు ఇప్పుడు ఫలితాలు వెలువడే రోజు వరకూ మాస్టర్ ప్లాన్ వేశాడట..

చంద్రబాబు వరుసగా మే 2 వ తేదీ నుంచి ఫలితాలు వెలువడే 23వ తేదీ మధ్యలో చిన్నచిన్న సమీక్షలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా తెలిసింది. అసలు ఇప్పుడు సమీక్షలు, అధికారులతో మీటింగ్ లు పెట్టడానికి ఏపీ సీఎస్ ఒప్పుకోవడం లేదు. ఆయనపై గుర్రుగా ఉన్న బాబు పంతం వీడడం లేదు. కాబట్టి ఒక వేళ ప్రభుత్వానికి సంబంధించిన రివ్యూలు సాధ్యం కాకపోతే…. ఎలాగూ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరపబోతున్నాడు కాబట్టి వాటి మీదే మీడియా ఫోకస్ అంతా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాడని వినికిడి.

ఇలా ఓటమి భయమో.. ప్రచార హడావుడో కానీ అధికార పీటం అంత త్వరగా వదలడానికి మాత్రం బాబుకు మనసొప్పడం లేదన్న టాక్ వినిపిస్తోంది.

First Published:  1 May 2019 11:17 PM GMT
Next Story