Telugu Global
NEWS

కోడెల పుట్టిన రోజుకు.... చికెన్‌ చందా

గురువారం రోజు కోడెల పుట్టిన రోజు. ఎంకి పెళ్ళి… సుబ్బి చావుకు వచ్చిందన్నట్టు కోడెల జన్మదినం వల్ల నరసరావు పేట పేదలకు ఈ నెల రేషన్‌ మాయం అవుతుంది. నరసరావుపేటలో ప్రతి లావాదేవి మీద కోడెల ట్యాక్స్‌ భరించే వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు అది చాలదనట్టు ఇలా జన్మదినం ట్యాక్స్‌లు కూడా పడుతున్నాయి. కోడెల జన్మదిన విందుకు అవసరమైన 300 కేజీల చికెన్‌ను తెచ్చిఇవ్వాలని నరసరావుపేటలో ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు హుకుం జారీ చేశారు టీడీపీ నాయకులు. […]

కోడెల పుట్టిన రోజుకు.... చికెన్‌ చందా
X

గురువారం రోజు కోడెల పుట్టిన రోజు. ఎంకి పెళ్ళి… సుబ్బి చావుకు వచ్చిందన్నట్టు కోడెల జన్మదినం వల్ల నరసరావు పేట పేదలకు ఈ నెల రేషన్‌ మాయం అవుతుంది. నరసరావుపేటలో ప్రతి లావాదేవి మీద కోడెల ట్యాక్స్‌ భరించే వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు అది చాలదనట్టు ఇలా జన్మదినం ట్యాక్స్‌లు కూడా పడుతున్నాయి.

కోడెల జన్మదిన విందుకు అవసరమైన 300 కేజీల చికెన్‌ను తెచ్చిఇవ్వాలని నరసరావుపేటలో ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు హుకుం జారీ చేశారు టీడీపీ నాయకులు. ఎప్పుడు టీడీపీ కార్యక్రమాలు జరిగినా ఇలా వాళ్ళ ఖర్చులను భరించడానికి అలవాటు పడ్డ వైన్‌ షాపుల వాళ్ళు, రేషన్‌ డీలర్లు ఈసారి కూడా చదివింపులు చెల్లించుకున్నారు.

రేషన్‌ డీలర్లు అయితే ఈసారి ఎదురుతిరిగారు. మంగళవారం నాడు తాసీల్దార్‌ కార్యాలయంలో డీలర్లతో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కోడెల జన్మదినోత్సవ వేడుకలకు చందాలు వసూలు చేయడంకోసమేనని రేషన్‌ డీలర్లు అంటున్నారు. ఈ సమావేశంలో డీలర్లంతా చందాలు ఇవ్వాలని కోరడంతో ఎలాగో ప్రభుత్వం మారుతుంది కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎదురుతిరిగారట.

ఇన్నాళ్ళూ ఇచ్చాం… ఇక ఇవ్వమని మొండికేశారంటున్నారు. పరిస్థితిని గమనించిన టీడీపీ నాయకులు రేషన్‌ డీలర్లు 115 మందిని కోడెల ఇంటికి ఆహ్వానించారు. ఒక్కొక్కరూ కనీసం వెయ్యి రూపాయలు చందా ఇవ్వకుంటే అధికారులతో రేషన్‌ షాపులపై దాడులు చేయిస్తామని, చందా ఇస్తే మే నెల సరుకులు రేషన్‌ కార్డు దారులకు ఇవ్వకుండా బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకున్నా పట్టించుకోమని ప్రతిపాదన పెట్టారు. దాంతో రేషన్‌ షాపుల వాళ్ళు తలా వెయ్యి రూపాయలు ముట్టజెప్పినట్లు తెలిసింది.

కోడెల పుట్టిన రోజు సందర్భంగా ఇలా రేషన్‌ డీలర్లనుంచి లక్షా 15 వేల రూపాయలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నుంచి 300 కేజీల చికెన్‌ సంపాదించినట్టు తెలిసింది. మరి ఇతర వర్గాల నుంచి ఎంత సంపాదించారో?…. ఇలా దేబిరించి పుట్టిన రోజులు జరుపుకోకపోతే ఏమి? అని నరసరావు పేట వాసులు అంటున్నారు.

First Published:  2 May 2019 5:52 AM GMT
Next Story