వంశీ ని పొగుడుతూ, సుకుమార్ కి కౌంటర్ ఇచ్చిన మహేష్

నిజానికి ‘మహర్షి’ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా ఆగిపోయింది.

ఇక సుకుమార్ అదే కథను అల్లు అర్జున్ ని హీరోగా పెట్టి తీసేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ‘మహర్షి’ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయం గురించి మాట్లాడుతూ మహేష్ బాబు సుకుమార్ పైన సెటైర్ వేశాడు.

వంశీ పైడిపల్లి గురించి చెబుతూ సుకుమార్ కు పంచ్ వేశాడు మహేష్….

“వంశీ ‘మహర్షి’ కథ చెప్పటానికి నా దగ్గరికి వచ్చినప్పుడు 20 నిమిషాల కథ విని పంపించేద్దామనుకున్నాను. కానీ కథ బాగా నచ్చింది. కానీ నాకు అప్పటికే కొన్ని క‌మిట్‌మెంట్స్ ఉన్నాయి. మ‌రో రెండు సినిమాల వ‌ర‌కూ చేయ‌డం కుద‌ర‌దని చెప్పా…. కానీ మీ కోసం ఎంత‌కాల‌మైనా ఎదురుచూస్తాను అని వంశీ అన్నాడట. ఈ రోజుల్లో రెండు నెల‌లు కూడా ఓ హీరో కోసం ఎదురుచూడ‌లేక‌ ఆ క‌థతో మ‌రో హీరో ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోతున్నారు. అలాంటిది ఇలా ఎదురుచూడటం చాలా కష్టం” అంటూ సుకుమార్ మీద ఇండైరెక్టు గా సెటైర్ వేశాడు మ‌హేష్‌.