Telugu Global
National

వారణాసిలో పసుపు రైతుల నామినేషన్లు తిరస్కరణ

పసుపు బోర్డు ఏర్పాటు, గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా రైతులు గత కొన్నాళ్లుగా పలు రకాలుగా తమ ఆందోళనను వ్యక్త పరుస్తున్నారు. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ కవితపై 185 మంది రైతులు నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి కూడా భారీగా నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకున్నారు. అందుకోసం దాదాపు […]

వారణాసిలో పసుపు రైతుల నామినేషన్లు తిరస్కరణ
X

పసుపు బోర్డు ఏర్పాటు, గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా రైతులు గత కొన్నాళ్లుగా పలు రకాలుగా తమ ఆందోళనను వ్యక్త పరుస్తున్నారు. నిజామాబాద్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ కవితపై 185 మంది రైతులు నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఇక దేశ ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నుంచి కూడా భారీగా నామినేషన్లు వేసి అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకున్నారు. అందుకోసం దాదాపు 50 మంది రైతులు ఒక ప్రత్యేక బస్సులో వారణాసి వెళ్లారు. సోమవారం నాడు అందరూ నామినేషన్లు వేశారు.

అయితే ఆర్మూరు నుంచి వెళ్లిన 25 మంది రైతుల నామినేషన్లలో కేవలం ఒక నామినేషన్‌ను మాత్రమే ఆమోదించారు. వారణాసి నుంచి 119 మంది నామినేషన్లు వేయగా 89 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

దీంతో ఆర్మూరు రైతులు నిరాశగా వెనుదిరిగారు. ఆర్మూరు రైతులకు తమిళనాడు రైతుల నుంచే కాకుండా స్థానిక రైతుల నుంచి కూడా మద్దతు లభించింది. కాని నిబంధనల మేరకు నామినేషన్లు లేనందువల్ల కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే ఆమోదం పొందింది.

First Published:  1 May 2019 8:40 PM GMT
Next Story