Telugu Global
Cinema & Entertainment

'ఆర్ ఆర్ ఆర్' లో సముద్రఖని పాత్ర ఇదే ?

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖని చేయబోతున్న పాత్ర గురించి ఒక వార్త బయటకు వచ్చింది. […]

ఆర్ ఆర్ ఆర్ లో సముద్రఖని పాత్ర ఇదే ?
X

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా గురించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖని చేయబోతున్న పాత్ర గురించి ఒక వార్త బయటకు వచ్చింది.

తమిళ్ నటుడు సముద్రఖని ఈ సినిమాలో ఎన్టీఆర్ బాబాయ్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ లో అంటే కొమరం భీమ్ పాత్రలో స్వాతంత్య్ర కాంక్షను తీసుకువచ్చిన పాత్ర లో సముద్రఖని కనిపించబోతున్నారట.

ఈ మధ్యనే దర్శకుడు రాజమౌళి తో సముద్రఖని తీసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూలైలో విడుదల కానుంది.

First Published:  1 May 2019 11:43 PM GMT
Next Story