‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా…. ఈ సినిమాకి కాపీనా?

ఈ మధ్యనే ‘హలో గురు ప్రేమకోసమే’ అనే సినిమాతో ఫ్లాప్ అందుకున్న హీరో రామ్ పోతినేని తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరి, ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా నిధి అగర్వాల్, నభ నటేష్ ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పోస్టర్లు…. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమయిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక హాలీవుడ్ సినిమా మీద ఆధారపడి ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథలోకి వెళితే ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా 2016 లో విడుదలైన ఇంగ్లీష్ సినిమా ‘క్రిమినల్’ లాగానే ఉండబోతోందని కొందరు చెబుతున్నారు.

‘క్రిమినల్’ సినిమా కథ ప్రకారం ఒక హ్యాకర్ ని సిఐఎ ఏజెంట్ పట్టుకోవాలి అనుకుంటాడు. కానీ ఆ ఏజెంట్ ని ఎవరో చంపేసి అతని బ్రెయిన్ లోని మెమరీస్ ని చిప్ ద్వారా క్రిమినల్ బ్రెయిన్ లోకి పంపిస్తారు.

మరి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా కథ ఇలా ఉంటుందో…. లేక పూరి ఫార్నట్ లోనే ఉంటుందో చూడాలి. అయితే ఈ వార్తలపై చిత్రబృందం ఇంకా రియాక్ట్ అవలేదు.